https://oktelugu.com/

పవన్ వెన్నంటే ఉంటూ దెబ్బేస్తున్న అభిమానులు..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటూ రాజకీయాల్లో.. ఇటూ సినిమాల్లోనూ ఫుల్ బీజీగా గడుపుతున్నారు. పవన్ కల్యాణ్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులు చాలామందే ఉన్నారు. అయితే రాజకీయాల్లోనూ.. సినిమాపరంగా పవన్ కల్యాణ్ కు అభిమానులే మైసస్ గా మారుతుండటం గమనార్హం. పవన్ కు అండగా నిలువాల్సిన అభిమానులు కొన్ని తొందరపాటు చర్యలతో పవన్ ను అబాసుపాలు చేస్తున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ పవన్ సినిమాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలని కోరిన అభిమానులు ఆమేరకు ఓట్లను మాత్రం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2020 / 12:06 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటూ రాజకీయాల్లో.. ఇటూ సినిమాల్లోనూ ఫుల్ బీజీగా గడుపుతున్నారు. పవన్ కల్యాణ్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులు చాలామందే ఉన్నారు. అయితే రాజకీయాల్లోనూ.. సినిమాపరంగా పవన్ కల్యాణ్ కు అభిమానులే మైసస్ గా మారుతుండటం గమనార్హం. పవన్ కు అండగా నిలువాల్సిన అభిమానులు కొన్ని తొందరపాటు చర్యలతో పవన్ ను అబాసుపాలు చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    పవన్ సినిమాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలని కోరిన అభిమానులు ఆమేరకు ఓట్లను మాత్రం వేయలేకపోయారు. దీంతో జనసేన పార్టీకి కేవలం ఒకే ఒక సీటు వచ్చింది. దీంతో పవన్ కల్యాణ్ ఇమేజ్ రాజకీయంగా చాలా డ్యామేజ్ అయింది. ప్రస్తుతం జనసేనకు రాజకీయంగా పెద్దగా స్కోప్ లేకపోవడంతో పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

    పవన్ కల్యాణ్ సినిమాలకు గుడ్ బై చెబుతారని భావించగా అనుహ్యంగా ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. దీంతోపాటు పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. అయితే కొందరు అభిమానుల అత్యుత్సాహం వల్ల పవన్ సినిమాలకు దెబ్బపడేలా కన్పిస్తోంది. ఈ ఇలాంటి సంఘటనే తాజాగా జరిగింది.

    Also Read: ఈసారి చిరు ఢీ కొట్టబోయేది హిందీ వాళ్లనే

    ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్లో తిరిగి ప్రారంభంగా పవన్ కల్యాణ్ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో షేర్ చేస్తుంది ముఖ్యంగా పవన్ అభిమానులే కావడం గమనార్హం. ఈ వీడియో వైరల్ అవుతుండటంతో పవన్ అభిమానులే మండిపడుతున్నారు.

    సెట్స్ లో వీడియో తీసేంత ఉదాసీనంగా చిత్రయూనిట్ ఎందుకు ఉందంటూ పవన్ అభిమానులే కామెంట్స్ చేస్తున్నారు. కానీ పవన్ సినిమాకు సంబంధించిన లీకులను షేర్ చేయకుండా ఉండలేకపోతున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ సినిమా వస్తుండటంతో అత్రుతగా ఉన్న అభిమానులు కొందరు ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఈ విషయంపై మరికొందరు అభిమానులు మండిపడుతున్నారు.

    Also Read: బిగ్ బాస్-4లో కోడిగుడ్ల మోత.. రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు..!

    సినిమా పైరసీ విషయంలో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ చర్యల వల్ల పవన్ సినిమాకు నష్టం జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటప్పుడే అభిమానులు బాధ్యతగా మెలగాలని సూచిస్తున్నారు. అయితే పవన్ వెన్నంటే అభిమానులు ఉంటూ అతడికి దెబ్బేస్తున్నారనే టాక్ సర్వత్రా విన్పిస్తోంది. ఇకనైనా అభిమానుల తీరు మారుతుందో లేదో వేచిచూడాల్సిందే..!