
బీహార్ రాష్ట్రంలో మూడోదశ పోలింగ్ శుక్రవారం జరగుతోంది. రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నప్పటికీ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శుక్రవారం మొత్తం 78 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధెపురాలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రంలో ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు సైతం ఓటేసేందుకు తరలివస్తున్నారు. సమస్తీపూర్ పరిధిలోని మోర్వా అసెంబ్లీ సీటు పరిధిలోని పోలింగ్ బూత్‌లలో మహిళా ఓటర్లు అధికంగా వచ్చారు. కాగా మొదటి, రెండో దశ కంటే శుక్రవారం జరుగుతున్న పోలింగ్‌లో ఓటర్లు అధికంగా వచ్చినట్లు తెలుస్తోంది.