Site icon OkTelugu

‘బాబా కా దాబా’ కేసులో వాసన్‌ అరెస్ట్‌

‘బాబా కా దాబా’ హోటల్‌ యజమానిని మోసగించిన కేసులో యూట్యూబ్‌ చానల్‌ నిర్వహించిన గౌరవ్‌ వాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ‘బాబా కా దాబా’ హోటల్‌ యజమాని కాంతా ప్రసాద్‌ ఆర్థిక ఇబ్బందులను వాసన్‌ తన యూబ్యూబ్‌ చానెల్‌ ద్వారా తెలిపాడు. ఆర్థికంగా ఆదుకోవాలని వాసన్‌ పిలుపునిచ్చాడు. అయితే వచ్చిన విరాళాల్లో అధికభాగం ఆయనే కాజేశాడని కాంతా ప్రసాద్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version