https://oktelugu.com/

పార్టీ మార్పుపై స్పందించిన విజయశాంతి

లేడీ సూపర్‌‌స్టార్‌‌గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్‌‌డమ్‌ సంపాదించిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తల్లి తెలంగాణ పార్టీ సాధించి.. అటు మెగాస్టార్‌‌ పైన.. ఇటు కేసీఆర్ పైన చాలాసార్లు విమర్శలు చేశారు. తదుపరి టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి పార్టీలో విజయశాంతి స్టార్‌‌ క్యాంపెయినర్‌‌ అయ్యారు. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ అయితే.. చాలా కాలంగా ఆమె కాంగ్రెస్‌ పార్టీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 09:39 AM IST
    Follow us on

    vijayashanthivijayashanthi

    లేడీ సూపర్‌‌స్టార్‌‌గా సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్‌‌డమ్‌ సంపాదించిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. తల్లి తెలంగాణ పార్టీ సాధించి.. అటు మెగాస్టార్‌‌ పైన.. ఇటు కేసీఆర్ పైన చాలాసార్లు విమర్శలు చేశారు. తదుపరి టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు. అప్పటి నుంచి పార్టీలో విజయశాంతి స్టార్‌‌ క్యాంపెయినర్‌‌ అయ్యారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    అయితే.. చాలా కాలంగా ఆమె కాంగ్రెస్‌ పార్టీలో అంత పెద్దగా యాక్టివ్‌ రోల్స్‌లో కనిపించడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ ముఖ్యులు కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో విజయశాంతికి కూడా వారి వైఖరి నచ్చడం లేదట. అందుకే గాంధీ భవన్‌ వైపు కూడా కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్‌ నేతల మీటింగ్‌లోకూ అటెండ్‌ కావడం లేదు.

    Also Read: తెలంగాణ చరిత్రలోనే అత్యధికం.. అమెజాన్ 20 వేల కోట్ల పెట్టుబడి

    ఇటీవల రాములమ్మ కాంగ్రెస్‌ను వీడి బీజేపీ గూటికి చేరుతున్నారని జరుగుతున్న ప్రచారం జోరుగా సాగింది. జూబ్లీహిల్స్‌లోని విజయశాంతి నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా ఆమె కలిశారు. సుమారు అరగంట పాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ సమావేశానికి కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు సమాచారం. నవంబర్ 10న ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి కమలం గూటికి చేరబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

    ఈ వార్తలపై తాజాగా నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. తమకు పూర్తి నమ్మకం ఉందని.. బీజేపీ లాంటి మతతత్వ పార్టీలోకి విజయశాంతి వెళ్లదని అన్నారు. ఆమెతో ఎన్నోసార్లు మాట్లాడానని తెలిపారు.

    Also Read: బాబు దృష్టిలో పవన్ కళ్యాణ్‌ కూడా విలనే..

    ఈ క్రమంలోనే మధుయాష్కీ వ్యాఖ్యలపై స్వయంగా విజయశాంతి స్పందించడం విశేషం. ‘రాష్ట్ర కాంగ్రెస్ లో కొందరు నాయకులు న్యూస్ చానెల్స్ లో లీకేజీల ద్వారా నాపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయిస్తున్నారు. వాస్తవాలను మాట్లాడిన మధుయాష్కీ గారికి నా ధన్యవాదాలు’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో విజయశాంతి క్లారిటీ ఇచ్చినట్టైంది. కాంగ్రెస్ లోని కొందరి తీరుపై గుర్రుగా ఉన్నారని అర్థమవుతోంది. అదే సమయంలో తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది.