కరోనా వైరస్ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. ప్రజలను అతలాకుతలం చేస్తోంది. సెకండ్ వేవ్ ప్రభావంతో దేశాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కరోనా వైరస్ మొదలై ఏడాదిన్నర గడిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. వీరిలో 35 లక్షల మందికిపైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. కరోనా మహమ్మారి రోజుకో రూపం దాల్చుతోంది. శాస్ర్తవేత్తలకు అంతుచిక్కడం లేదు.
డిసెంబర్ 2019లో తొలిసారి చైనాలో వెలుగు చూసిన వైరస్ జన్యుమార్పులకు గురవుతూ కొత్త రూపాలను మార్చుకుంటోంది. తాజాగా గాలిలో వేగంగా వ్యాప్తి చెందే సరికొత్త రకంగా వియత్నాం గుర్తించింది. భారత్, యూకేలో తొలిసారి గుర్తించిన స్టెయిన్లతో సంయుక్తంగా జన్యుమార్పిడికి గురైనట్లు వియత్నాం ఆరోగ్య అధికారుల ప్రకటించారు. వియత్నాంలో వైరస్ మరోసారి విజృంభిస్తోంది. పారిశ్రామిక జన్లు, హోనోయ్, హోం చిమిన్హ్ వంటి నగరాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.
వియత్నాంలో ఏప్రిల్ నుంచి ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు 6800 కేసులు, 47 మరణాలు సంభవించాయి. భారత్, యూకేలో తొలిసారి గుర్తించిన స్ర్టెయిన్తో కలిసి ఏర్పడిన కొత్త రకం వ్యాధిని గుర్తించారు. గాలిలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం ఈ వ్యాధి లక్షణమని చెబుతున్నారు. గొంతు స్రావంలో వైరస్ సాంద్రత వేగంగా వ్యాపిస్తుంది. ప్రపంచం జన్యు పరిణామ మ్యాప్ ను వియత్నాం త్వరలోనే ప్రకటిస్తుందన్నారు. శాస్ర్తవేత్తలు 32 నమూనాలనకు జన్యు పరీక్షలు నిర్వహించారు. నలుగురిలో మ్యుటెంట్ వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు.
వియత్నాంలో ఏడు రకాల కొత్త కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. తొలిదశలో కరోనాను సమర్థంగా కట్టడి చేసింది. మహమ్మారి ఉధృతిని అడ్డుకుంది. తాజాగా కేసులు పెరగడంతో ప్రభుత్వాన్ని భయానికి గురి చేశాయి. లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. వియత్నాంలో 10 లక్షల మందికి మాత్రమే వ్యాక్సినేషన్ వేశారు. ఈ ఏఢాది చివరి నాటికి హెర్డ్ ఇమ్యూనిటీ లక్ష్యం చేరుకుంటామని ఆరోగ్య శాఖ తెలిపింది.
వియత్నాంలో రష్యా తయారు చేసిన స్పెత్నిక్-వీ టీకా కొనుగోలు చేయాలని భావించింది. పక్కనే ఉన్న థాయ్ లాండ్ లో ఓ కొత్త రోగం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ మీడియాలో శనివారం దీనిపై ప్రచారం సాగింది. తొలిసారి థాయ్ లాండ్ లో ఓ 33 ఏళ్ల ఈజిప్టు మహిళకు ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. బ్రిటన్ లో109 కేసులు బయటపడ్డాయి.