లాక్ డౌన్ పై తేల్చేసిన కేసీఆర్.. ఈసారి ట్విస్ట్ ఇదే

తెలంగాణలో లాక్ డౌన్ తో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా.. పేదలు, సామాన్యులకు పని లేక కష్టం అవుతున్నా.. కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో లాక్ డౌన్ ను మరో 10రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈనెల లాక్ డౌన్ తో 4వేల కోట్లు నష్టపోయింది. ప్రతీ నెల తెలంగాణ ఆదాయం […]

Written By: NARESH, Updated On : May 30, 2021 6:51 pm
Follow us on

తెలంగాణలో లాక్ డౌన్ తో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా.. పేదలు, సామాన్యులకు పని లేక కష్టం అవుతున్నా.. కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ తప్ప మరో మార్గం లేదని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో లాక్ డౌన్ ను మరో 10రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈనెల లాక్ డౌన్ తో 4వేల కోట్లు నష్టపోయింది. ప్రతీ నెల తెలంగాణ ఆదాయం 8500 కోట్లు కాగా.. ఈనెల కేవలం 4వేల కోట్లు మాత్రమే వచ్చింది. ఒక మద్యంపై తప్ప మరో ఆదాయం తెలంగాణకు కరువైంది.

అయితే తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత.. కేసులు లాక్ డౌన్ తో తగ్గుతున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ ప్రజారోగ్యం విషయంలో రాజీపడలేకపోయారు. ఎంత ఆర్థిక నష్టం వాటిల్లినా కూడా మరోసారి లాక్ డౌన్ కే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే కాస్త సడలింపులు ఈసారి ఇచ్చారు. మూడు గంటలు పెంచారు.

ఇప్పటికే ఎంఐఎం అధినేత ఓవైసీ సహా పలువురు లాక్ డౌన్ ఎత్తివేయాలని కోరారు. పేదలు, మధ్య తరగతి ఆదాయం కోల్పోయి అష్టకష్టాలు పడుతున్నారని.. లాక్ డౌన్ తో అందరి ఉపాధి పోయిందని గగ్గోలు పెట్టినా కూడా కరోనా వైరస్ ను అరికట్టడానికి లాక్ డౌన్ తప్ప మరో ప్రత్యామ్మాయం లేదని కేసీఆర్ తేల్చేశారు.

తెలంగాణలో లాక్ డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్ డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినేట్ మళ్లీ జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే కాస్త సడలింపును ఇచ్చంది. లాక్ డౌన్ లో ప్రజలు బయట తిరిగే సమయాన్ని మూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయ 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా దాన్ని మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు.