
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో విషాధం చోటు చేసుకుంది. హుకుం పేట మండలంలోని తీగలవలస శివారులోని జలపాతంలో సరదాగా స్నానం చేస్తూ నీటి ఉధృతిలో ముగ్గురు గల్లంతయ్యారు. స్థానికులు వీరిని రక్షించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గల్లంతైన ముగ్గురిని హుకుం పేట మండలం సన్యాసిపాలెం వాసులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు జలపాతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలంలో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.