కేంద్రప్రభుత్వంతో రైతుల చర్చలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆందోళనలో చనిపోయిన అన్నదాతలకు మంత్రులు,రైతు సంఘాల నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో సోమవారం ఏడోవిడత చర్చలు సాగనున్నాయి. ఈ చర్చల్లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఆరు విడుతలుగా రైతులతో చర్చలు జరిపారు.కొన్నింటికి అంగీకారం తెలిపిన రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో ఈరోజుచర్చలు విఫలమైతే ఆందోళన మరింత ఉద్రుతంగా సాగిస్తామని ఇదివరకే ప్రకటించారు.