
గత నెల కిందట ప్రారంభమైన విద్యాసంస్థల్లో కరోనా విజ్రుంభిస్తోంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు విద్యా సిబ్బంది కరోనా కోరల్లో చిక్కకకున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని మద్రాసు ఐఐటీలో కరోనా వైరస్ కలకలం రేపింది తాజాగా 774 మంది విద్యార్థులున్న క్యాంపస్ లో 66 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. మరో ఐదుగురు సిబ్బందికి కూడా కరోనా సోకింది. దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఇనిస్టిట్యూట్ ను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అధ్యాపకులు, ఇతర సిబ్బంది తమ ఇళ్లలో నుంచే విధులు నిర్వహించాలని సూచించింది. మరోవైపు పాజిటివ్ నిర్ధారణ అయిన విద్యార్థులు క్యాంపస్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. వారిని ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. భౌతిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.