https://oktelugu.com/

స్నేహితుడి పాపం.. వరుడికి శాపం..! ఆగిన పెళ్లి..

ఓ వివాహ వేడుకలో వరుడి స్నేహితుడు చేసిన పాపానికి ఆయన పెళ్లి ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన వైరల్ గామారింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో ఓ వివాహం జరుగుతోంది. మరో రోజు తాళి కట్టే కార్యక్రమం జరగనుంది. అంతకుముందు రోజు జరిగే సంగీత్ కార్యక్రమంలో వేడుకలకు హాజరైన వారు చిందులేస్తున్నారు. ఇదే సమయంలో వరుడి స్నేహితుడొకరు వధువు చెయ్యి పట్టుకొని లాగారు. అలాగే మద్యం తాగిని వరుడి స్నేహితుల ప్రవర్తనతో ఆ వధువు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 14, 2020 / 02:02 PM IST
    Follow us on

    ఓ వివాహ వేడుకలో వరుడి స్నేహితుడు చేసిన పాపానికి ఆయన పెళ్లి ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన వైరల్ గామారింది. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో ఓ వివాహం జరుగుతోంది. మరో రోజు తాళి కట్టే కార్యక్రమం జరగనుంది. అంతకుముందు రోజు జరిగే సంగీత్ కార్యక్రమంలో వేడుకలకు హాజరైన వారు చిందులేస్తున్నారు. ఇదే సమయంలో వరుడి స్నేహితుడొకరు వధువు చెయ్యి పట్టుకొని లాగారు. అలాగే మద్యం తాగిని వరుడి స్నేహితుల ప్రవర్తనతో ఆ వధువు తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఆగ్రహం చెందిన వధువు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. అంతేకాకుండా ఆ వివాహం చేసుకోనని చెప్పింది. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వధువు జరిగినదంతా చెప్పడంతో ఆ వివాహం ఆగిపోయింది.