జంప్ జిలానీలతో టీఆర్ఎస్ షేక్ కానుందా?

తెలంగాణలో సీఎం కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గత ఆరేళ్లుగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడింతే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. అయితే దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికలతో కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదగడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల్లో మంత్రులుగా.. ఎమ్మెల్సేలుగా.. ఎంపీలు.. […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 1:44 pm
Follow us on

తెలంగాణలో సీఎం కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గత ఆరేళ్లుగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడింతే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. అయితే దుబ్బాక ఉప ఎన్నిక.. గ్రేటర్ ఎన్నికలతో కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదగడంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల్లో మంత్రులుగా.. ఎమ్మెల్సేలుగా.. ఎంపీలు.. ఎమ్మెల్సీలుగా పని చేసేవారంతా ఆపార్టీలోకి క్యూ కట్టారు. అయితే వీరిలో కొందరికీ మాత్రమే వారు ఆశించి పదవులు దక్కగా మెజార్టీ నేతల పప్పులు కేసీఆర్ దగ్గర ఉడకలేదు.

కేసీఆర్ గత ఆరేళ్లుగా కుటుంబ సభ్యుల పాలనతో పాలనకు వెళ్లదీస్తుకొచ్చారనే విమర్శలున్నాయి. ఈక్రమంలోనే కొందరు టీఆర్ఎస్ మంత్రులు.. ఇతర నేతలు కేసీఆర్ పై నిరసన గళం ఎత్తగానే అవినీతి ఆరోపణల పేరుతో వేటు వేయడం.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండం వంటివి జరిగాయి. దీంతో మిగతా నేతలెవరూ కేసీఆర్ పై నోర్లు తెరిచే సాహసం చేయలేదనే టాక్ ఉంది.

ఇతర పార్టీల నుంచి ఏ ఆశలతో టీఆర్ఎస్ లో నేతలు చేరారో.. వారికి మళ్లీ అలాంటి ఆశలు పుట్టకుండా కేసీఆర్ చేశారనే గుసగుసలు టీఆర్ఎస్ లో విన్పిస్తున్నాయి. దీంతోపాటు టీఆర్ఎస్ అధికారంలో వచ్చాక సీఎం కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకోకుండా ఉద్యమ ద్రోహులకు పదవుల కట్టబెట్టారనే ఆరోపణలతో ఆయనపై ఓ వర్గం గుర్రుగా ఉందనే టాక్ ఉంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదగడంతో టీఆర్ఎస్ లో ఇన్ని రోజులు అసంతృప్తితో కొనసాగుతున్న నేతలంతా బయటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే కేసీఆర్ పై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నేతలకు హామీ ఇస్తున్నారట. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.

త్వరలోనే ఖమ్మం.. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ చెందిన 30మంది కీలక నేతలు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే కండువా వేసినట్లు టాక్ విన్పిస్తోంది. అయితే బీజేపీలో చేరికలు ఆపేందుకు సీఎం కేసీఆర్ త్వరలోనే నామినేటేడ్ పదవులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు వరద సాయం.. ల్యాండ్ రిజిస్ట్రేషన్లు.. ఉద్యోగాల నోటిఫికేషన్లు.. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ తన పాలనపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకను పొగొట్టే పనిలో కేసీఆర్ పడ్డారు. అయితే టీఆర్ఎస్ లో అసంతృప్తిగా కొనసాగుతున్న నేతలు బీజేపీలోకి వెళ్లకుండా కేసీఆర్ ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తిని రేపుతోంది.