దానిమ్మ జ్యూస్ తో కరోనా వైరస్ కు చెక్ పెట్టవచ్చా..?

ఈ సీజన్, ఆ సీజన్ అనే తేడాల్లేకుండా అన్ని సీజన్లలో లభించే పండ్లలో దానిమ్మ పండ్లు కూడా ఉంటాయి. రుచితో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్లు ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దానిమ్మ పండ్లు తీసుకుంటే ఎంతో మంచిదని.. రోగనిరోధక శక్తిని పెంచడంలో దానిమ్మ పండ్లు సహాయపడతాయని చెబుతున్నారు. కరోనా సోకిన వాళ్లు దానిమ్మ రసం తాగితే మంచి ఫలితాలు ఉంటాయని.. దానిమ్మలో కరోనా వైరస్ ను […]

Written By: Navya, Updated On : November 18, 2020 9:40 am
Follow us on

ఈ సీజన్, ఆ సీజన్ అనే తేడాల్లేకుండా అన్ని సీజన్లలో లభించే పండ్లలో దానిమ్మ పండ్లు కూడా ఉంటాయి. రుచితో పాటు మన శరీరానికి అవసరమైన విటమిన్లు ఈ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దానిమ్మ పండ్లు తీసుకుంటే ఎంతో మంచిదని.. రోగనిరోధక శక్తిని పెంచడంలో దానిమ్మ పండ్లు సహాయపడతాయని చెబుతున్నారు.

కరోనా సోకిన వాళ్లు దానిమ్మ రసం తాగితే మంచి ఫలితాలు ఉంటాయని.. దానిమ్మలో కరోనా వైరస్ ను చంపే గుణాలు పుష్కలంగా ఉన్నాయని తెలుపుతున్నారు. ఉల్మ్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ వైరాలజీ, కాగ్నివర్డే జిఎమ్‌బిహెచ్, టెక్నిష్ యూనివర్సిటీ డ్రెస్డెన్ శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. దానిమ్మ కరోనా వైరస్ కు చెక్ పెట్టడంతో పాటు కరోనా సంక్రమణనను కూడా అడ్డుకుంటుందని తెలిపారు.

దానిమ్మ రసంతో పాటు ఎల్డర్‌బెర్రీ జ్యూస్ తాగినా, గ్రీన్ టీ తీసుకున్నా ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. దానిమ్మ జ్యూన్ తీసుకుంటే కడుపు నొప్పి, కండ్ల కలక లాంటి సమస్యలను కూడా కూడా సులువుగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. రోజూ దానిమ్మ రసం తాగేవాళ్లకు చర్మం చాలా మృదువుగా ఉంటుంది. పైల్స్ సమస్యతో బాధ పడే వాళ్లు దానిమ్మ జ్యూస్ తాగితే ఆ సమస్య దూరమవుతుంది.

దానిమ్మ జ్యూస్ తాగేవాళ్లలో జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. శాస్త్రవేత్తల పరిశోధనల్లో దానిమ్మ జ్యూస్ ఎక్కువగా తీసుకునే వాళ్లు హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడటం లేదని తేలింది. దానిమ్మ రక్త హీనత సమస్యను తగ్గించడంతో పాటు దంత సమస్యలను సైతం దూరం చేస్తుంది.