Omicron variant: కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొత్త వేరియంట్ తో అలజడి రేపుతోంది. పలు పట్టణాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ తో ప్రజల్లో ఆందోళన కలుగుతోంది. రోజురోజుకు వైరస్ తీవ్రత పెరుగుతోంది. ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరగడంతో ప్రజల్లో భయాందోళన కలుగుతోంది. బెంగుళూరులో ఇద్దరికి ఈ వైరస్ సోకడంతో దేశం యావత్తు కంగారు పడుతోంది. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఇటీవల ప్రారంభమైన పాఠశాలలు మళ్లీ మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి.

రెండు రోజులుగా యాక్టివ్ కేసులు పెరగడంతో ప్రజల్లో టెన్షన్ ఎక్కువవుతోంది. మూడో దశ ముప్పు ఉందని శాస్ర్తవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కేసులు పెరగడంతో మూడో దశ ముప్పు పొంచి ఉందనే విషయం తెలిసిపోతుందని చెబుతున్నారు. ఇప్పుడే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.
Also Read: భారత్ లోకి ఒమిక్రాన్ వైరస్.. థర్డ్ వేవ్ వస్తుందా? నిపుణుల మాట ఇదీ
ప్రస్తుతం దేశంలో కూడా కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వాలు సైతం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఏర్పడుతోంది. ముప్పు వాటిల్లినాక తేరుకునే బదులు ముందే అప్రమత్తంగా ఉంటే వైరస్ ను ఎదుర్కోవడం తేలికగా ఉంటుందని తెలుస్తోంది. దీని కోసమే మహారాష్ర్ట, తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాల్లో వైరస్ దాడి పెరిగిన నేపథ్యంలో మిగతా నగరాలు వైరస్ ను కట్టడి చేసే పనుల్లో నిమగ్నం కావాల్సిన అవసరం గుర్తించాలి.
Also Read: భారత్ లోకి ఒమిక్రాన్ వైరస్.. థర్డ్ వేవ్ వస్తుందా? నిపుణుల మాట ఇదీ
పాజిటివిటీ కేసులు ఎక్కువ కావడంతో మళ్లీ ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే మొదటి, రెండో దశల్లో ప్రజలను కష్టాలకు గురి చేసిన వైరస్ కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో ప్రాణాలు బలి తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వాలు ఏ మేరకు అడ్డుకుంటాయో వేచి చూడాల్సిందే.