Homeఎంటర్టైన్మెంట్Kiran Abbavaram: అన్నను ఇలా పరిచయం చేస్తా అనుకోలేదంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో కిరణ్...

Kiran Abbavaram: అన్నను ఇలా పరిచయం చేస్తా అనుకోలేదంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో కిరణ్ అబ్బవరం…

Kiran Abbavaram: “రాజా వారు రాణి గారు” సినిమాతో కిరణ్‌ అబ్బవరం తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం మూవీకి సొంతంగా స్క్రిప్ట్‌ రాసి హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. దీంతో కిరణ్‌ అబ్బవరం ఇటూ హీరోగా, అటూ సినీ రచయితగా ఇప్పుడిప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నాడు. ఈ క్రమంలో కిరణ్‌ సోదరుడు రామాంజులు రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

young hero kiran abbavaram emotional post about is brother ramanjulu

డిసెంబర్‌ 1వ తేదీ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇక సోదరుడిని తలచుకుంటూ హీరో కిరణ్‌ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అన్నను గుర్తు చేసుకుంటూ కిరణ్‌ రాసుకొచ్చిన ఆ పోస్ట్ లో…  ఒరేయ్ కిరా మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదురా. మన ఇద్దరిలో ఎవరో ఒకరం గట్టిగా సాధించాలిరా అని మా అన్నయ్య రామాంజులు రెడ్డి అనేవాడు. తనకి వీలైన దాని కంటే ఎక్కువ గానే నన్ను సపోర్ట్ చేశాడు. తన సరదా సంతోషాలను నా కోసం త్యాగం చేశాడు. ఇప్పుడిప్పుడే ఏదో సాధిస్తున్నానని అనుకునే లోపే తను లేకుండా పోయాడు. అందరికీ నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావురా ? అని అప్పుడప్పుడు నన్ను అడిగేవాడు.

https://www.instagram.com/p/CW_zS8UhCEu/?utm_source=ig_web_copy_link

ఏదైనా సాధించిన తరువాత పరిచయం చేద్దామనుకున్నా. కానీ ఇలా చేయవలసి వస్తుందని అనుకోలేదు. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆనందం కోసం కష్టపడేవాళ్లు ఉంటారు. అది మీరు పొందకుండా పోతే వాళ్లు తట్టుకోలేరు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ భావోద్వేగభరితమైన పోస్ట్‌ చూసిన వారంతా ఆవేదన చెందుతూ కిరణ్ కు, వారి కుటుంబ సభ్యులకు సంఘీభావంగా కామెంట్లు చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular