టీమిండియాయ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ ఎందుకు తప్పుకున్నాడు? విరాట్ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారా? టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోవడానికి గల కారణాలేంటి? తన ఇష్ట ప్రకారమే ఆ నిర్ణయం తీసుకున్నాడా? గత కొద్ది రోజులుగా క్రికెట్ ప్రేమికుల మెదడు తొలుస్తున్న ప్రశ్నలివి. దీనిపై బీసీసీఐ స్పందించింది. కోహ్లీ నిర్ణయం పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని బీసీసీఐ స్పష్టం చేసింది.

దుబాయ్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. పనిభారం ఎక్కువయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. అయితే కోహ్లీ ప్రవర్తన నచ్చక టీమ్ లోని సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐకి కంప్లైట్ ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. సినియర్లు ఫిర్యాదుపై బీసీసఐ సీరియస్ అయిందని.. కోహ్లీని టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేసిందని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయం పై బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ స్పందించారు. కోహ్లీ కెప్టెన్సీ కి రాజీనామా చేసే విషయంలో ఆయన పై ఎవరూ ఒత్తిడి తేలేదని.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో విజయాలు, అద్భుతాలు ఎప్పటికీ మరిచిపోలేనివని ఆయన అన్నారు.
అలాగే రాబోయే ప్రపంచకప్ లో ధోనీని మెంటర్ గా కొనసాగించడం భారత జట్టుకు, దేశానికి చాలా ఉపయోగకరం.. జట్టులో ధోనీకి మంచి గౌరవం ఉందని తెలిపారు. కోహ్లీ ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడమే అంటున్నారు బీసీసీఐ అధికారులు. ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడిన ఇండియా ఓడిపోయింది. వీటికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.