Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘లవ్ స్టోరి’ సినిమా సక్సెస్ సంబరాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే తాజాగా చైతు ఈ సినిమా విజయం పై స్పందించాడు. చైతు మాటల్లోనే.. ‘నాకు సూపర్ హిట్ అందించిన టీమ్ మొత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను జీవితాంతం గుర్తుంచుకొనేలా ఎన్నో మధుర జ్ఞాపకాలను నాకు ఈ ‘లవ్‌స్టోరీ’ సినిమా అందించింది’ అంటూ నాగచైతన్య ఈ మేరకు తన సినిమా టీమ్ తో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇక గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి జరిగిన బిజినెస్ రూ. 31.20 కోట్లు. అయితే లవ్ స్టోరి కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ లాభాల దిశగా సాగుతోంది. ఇప్పటికే యూఎస్ లో 1 మిలియన్ మార్క్ ను అందుకుంది.
ఇక ఈ సెకండ్ వీకెండ్ లో ఈ సినిమా సాధించే కలెక్షన్స్ అన్ని ఇక లాభాలే. అమ్మాయిలపై కుటుంబసభ్యులే లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే సున్నితమైన అంశాలతో ఈ సినిమా రావడం.. పైగా ఫ్యామిలీ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం ఈసినిమాకి బాగా కలిసి వచ్చింది. ఒక విధంగా ఈ అంశమే బాగా ఆకట్టుకుంది.
పైగా సాయి పల్లవి డ్యాన్స్.. ఇక జుంబా ట్రైనర్ గా చైతు నటన సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేసి.. ఉద్యోగ వేటలో ఉన్నవాళ్లకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అలాగే ముఖ్యంగా సమాజంలో కనిపించే కుల వివక్ష సమస్యను ప్రధానంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం, ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది.