Mukesh Ambani : ఇండియాలో అపర కుబేరుడు గా పేరు పొందిన ముఖేష్ అంబానీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంబాని ఫ్యామిలీ అంటే చాలు దేశంలో అత్యంత ధనికులుగా పేరు సంపాదించారు.
ముఖ్యంగా ధీరుభాయ్ అంబాని చాలా బిజినెస్ లను స్థాపించి బాగా డబ్బులు సంపాదించాడు ఇక దాంతో ముఖేష్ అంబానీ కూడా తన బిజినెస్ మైండ్ తో అంతకంతకు సంపదను పెంచుకుంటూ వస్తున్నాడు.చాలా సంవత్సరాల నుంచి ఇండియా లో వీళ్ళు నెంబర్ వన్ ధనవంతులు గా కొనసాగుతున్నారు.ఇక ఇది ఇలా ఇక ఈరోజు అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కూడా అంబాని దంపతులు హాజరయ్యారు.
ఇక ముఖేష్ అంబానీ యాంటీలియా భవనాన్ని చాలా చక్కగా అలంకరించాడు.ఆ భవనం మొత్తం జై శ్రీరామ్ అనే వెలుగులు వచ్చేలా లైటింగ్ ని సెట్ చేశారు. 27 అంతస్తులున్న ఈ భవనం మొత్తానికి జైశ్రీరామ్ అనే పేరు వచ్చేలా అద్భుతంగా లైటింగ్ చేయడంతో ఈ భవనానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…
ఇక అలాగే అంబానీ కూడా ఇవాళ్ళ జరిగిన రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తను కూడా కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. ఇక ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు కూడా గర్వపడాల్సిన రోజు అనే చెప్పాలి. 500 సంవత్సరాల నుంచి అయోధ్యలో రామ మందిరానికి నిర్మాణానికి సంభందించిన అలర్లు జరుగుతూ వస్తున్నాయి.
ఇక ఈ క్రమంలో ఒకానొక దశ లో అయోధ్య లో రామ మందిరం నిర్మిస్తామా లేదా అని హిందువులందరూ తీవ్రమైన నిరాశకి గురయ్యారు. ఎట్టకేలకు 2019 వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రామ మందిరం కల నెరవేరింది.ఇక దాంతో 2020 లో రామ మందిరానికి మన ప్రధాని అయిన మోడీ శంకుస్థాపన చేశాడు. ఇక ఈ రోజు రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం తో భారతదేశం మొత్తం ఈరోజు పండగ జరుపుకుంటున్నారు…
Home of one of the richest man of the world- Mukesh Ambani's Antilia#JaiShriRam pic.twitter.com/n6TaKrBIqx
— Megh Updates ™ (@MeghUpdates) January 21, 2024