Mohan Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీకి 40 సంవత్సరాల నుంచి తన సేవలను అందిస్తూ వస్తున్న హీరోలలో మోహన్ బాబు ఒకరు. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో దాసరి నారాయణరావు గారి సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవాడు. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబు కి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ దాసరి గారనే చెప్పాలి. ఆయన మోహన్ బాబుని విలన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇక అలాంటి క్యారెక్టర్లలోనే నటిస్తూ మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. కామెడీ విలన్ గా కూడా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా తన లాంటి నటనని ఎవరు చేయలేరు అనేంత గొప్ప గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఈ క్రమంలోనే ఈయన హీరోగా కూడా మారి మంచి సినిమాలను తీసి ప్రేక్షకులను అలరించాడు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కొద్ది సంవత్సరాల క్రితం రాఘవేంద్రరావు సౌందర్య లహరి అనే ప్రోగ్రాం లో తను ఎవరితో అయితే సినిమాలు చేశాడో వాళ్ళని పిలిచి వాళ్ల సినిమాకి సంబంధించిన డిస్కషన్ పెట్టేవాడు.అలానే ఒకరోజు మోహన్ బాబు గెస్ట్ గా వచ్చాడు.ఇక మోహన్ బాబు తో పాటు మరి కొంతమంది దర్శకులు కూడా ఆ షో కి గెస్ట్ గా వచ్చారు. వాళ్ళెవరూ అంటే కోదండరామిరెడ్డి, బి.గోపాల్ లాంటి డైరెక్టర్లు ఉన్నారు.
ఇలాంటి క్రమంలోనే ఈ షో కి వాళ్ళు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే కోదండరామిరెడ్డి, బి.గోపాల్ ఇద్దరూ రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్స్ గా వర్క్ చేశారు. అందుకే వాళ్ళు కూడా రావాల్సి వచ్చింది. ఇక ఇలాంటి క్రమంలో మోహన్ బాబు ఈ ఇంటర్వ్యూలో కోదండరామిరెడ్డి గురించి మాట్లాడుతూ ‘‘వీడు నాతో సినిమా చేయమంటే అసలు చేయలేదు. వీడికి పొగరు ఎక్కువగా ఉంటుంది’’ అంటూ కొందండ రామిరెడ్డి పైన కోపంతో విరుచుకుపడ్డాడు. ఇక అప్పుడు కోదండరామిరెడ్డి దానికి సమాధానం ఇస్తూ ‘‘నేను అప్పుడు వేరే సినిమాల్లో బిజీగా ఉన్నాను. అందువల్ల నీతో సినిమా చేయలేకపోయాను’ అని చెప్పాడు. అయినప్పటికీ మోహన్ బాబు మాత్రం ఒప్పుకోలేదు. అలా చేయడం నీ తప్పని ఒప్పుకో అని అతని చేత అతనిదే తప్పు అని ఒప్పించిన తర్వాత అప్పుడు మోహన్ బాబు కూల్ అయ్యాడు.
ఇక ఇదంతా చూసిన ప్రేక్షకులు మాత్రం మోహన్ బాబు ఎందుకు అలా షోలో బిహేవ్ చేస్తాడు. అవతలి వ్యక్తికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వడు అని మోహన్ బాబు ని తీవ్రంగా విమర్శించారు… ఈ ఒక్కసారీ అనే కాదు ఆయన ఏ ఈవెంట్ కి వచ్చిన కూడా అందరి మీద అరుస్తూ మాట్లాడుతూ కోపానికి వస్తూ ఎక్కువ విమర్శలని మూట గట్టుకుంటూ ఉంటాడు…