Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Pre Release Event: 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్...

Ustaad Bhagat Singh Pre Release Event: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ ని ఒక రేంజ్ లో ర్యాగింగ్ చేసిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh Pre Release Event: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అభిమానులు వేలాది […]

Ustaad Bhagat Singh Pre Release Event: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అభిమానులు వేలాది గా తరళి రావడంతో గ్రౌండ్ సరిపోక, బయట ఎంతో మంది అభిమానులు ఆగిపోయారు. పాసులు ఉన్న వాళ్ళను కూడా లోపలకు అనుమతించకపోవడం తో కాస్త గందరగోళం వాతావరణం ఏర్పడింది. ఇదంతా పక్కన పెడితే నిన్నటి ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ , యాంకర్ సుమ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఇంత ఆనందంగా ఉండడం చూసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

ఇంతకు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఒకసారి చూద్దాం. యాంకర్ సుమ పవన్ కళ్యాణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘సార్ అప్పట్లో మీకు బైక్స్ అంటే ప్యాషన్ అని నాతో ఇంటర్వ్యూ లో చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది కదా, దేని మీదైనా ప్యాషన్ పెరిగిందా అని అడగ్గా, అందుకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ ‘అప్పట్లో అంటే ఏంటి మీ ఉద్దేశ్యం.. మొన్నీమధ్యనే కదా కలిశాము. అప్పట్లో అంటే నేను ఎస్వీ రంగారావు గారు కలిసి కూర్చున్నప్పుడా ?, లేదంటే నేను , సీనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడుకుంటున్నప్పుడా ?, ఇది చాలా అన్యాయం అండీ’ అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఫన్నీ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ వీడియో నే కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగం చివర్లో కూడా యాంకర్ సుమ ని ర్యాగింగ్ చేసిన విధానం వేరే లెవెల్ లో ఉన్నింది.

ఆయన మాట్లాడుతూ ‘ఇందాక సుమ గారు చెప్పినట్టు. చాలా దశాబ్దాల క్రితం, అప్పుడెప్పుడో నేను చాలా సినిమాలు చేస్తున్నప్పుడు. మీకు గుర్తు ఉండే ఉంటుంది కదా, చాలా రోజుల క్రితం , కొన్ని శతాబ్దాల క్రితం , మర్చిపోయిన నా భావన ని ఈ చిత్రం లో హరీష్ గారు తీసుకొచ్చారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఆ సన్నివేశాన్ని చేశాను ‘ అంటూ వెటకారంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు నిన్న ఈవెంట్ కి పెద్ద హైలైట్ గా నిల్చింది. ఈ రెండు వీడియోలను మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper