Salaar – Prabhas : ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా థియేటర్ లలో నడుస్తుండగానే శుక్రవారం జనవరి 19వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటిటిలోకి వచ్చింది. ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ సలార్ సినిమాని స్ట్రీమింగ్ చేస్తుంది.
ఇక ఇలాంటి సమయంలో నెల రోజులు కూడా పూర్తికాక ముందే సలార్ సినిమా ఓటిటి లోకి రావడం పట్ల అభిమానులు కొంతవరకు నిరాశ చెందినప్పటికీ కూడా భారీ లాభాలను దక్కించుకోవడానికి సినిమా మేకర్స్ ఇలాంటి ప్లాన్ వేశారని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా రన్ టైం 2 గంటల 55 నిమిషాలు ఉన్నప్పటికీ అందులో ప్రభాస్ చెప్పిన డైలాగులు చాలా తక్కువ సమయం ఉండడం ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక ప్రభాస్ చెప్పిన డైలాగ్ లన్నింటిని ఒక వీడియోలో పొందుపరిచి చూస్తే 4 నిమిషాల లోపే ఉండచ్చని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఆ డైలాగ్స్ మధ్యలో ఉన్న గ్యాప్ లను తీసేసి చూస్తే కేవలం రెండున్నర నిమిషాల్లోనే డైలాగులు మొత్తం పూర్తి అవుతాయి అంటూ మరి కొంత మంది చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఈ విషయం చాలామంది అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏ సినిమాలో కూడా ప్రభాస్ ఇంత తక్కువ డ్యూరేషన్ లో డైలాగులు చెప్పలేదు.
#Salaar:#Prabhas Dialogues – 2 Mins 33Secs pic.twitter.com/oX8h4HZF1R
— Movies4u (@Movies4uOfficl) January 21, 2024
అయితే ఈ సినిమాలో ప్రభాస్ అవసరాన్ని బట్టి మాట్లాడుతాడు తప్ప అంతకుమించి ఎక్కువగా మాటలు ఉండవు ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఈ సినిమా లో డ్యూరేషన్ అనేది చాలా తగ్గిపోయిందనే చెప్పాలి. ఇక ఓటిటి లోకి వచ్చిన ఈ సినిమా ఓటిటి లో కూడా దుమ్మురేపే కలెక్షన్స్ ని దక్కించుకుంటుందంటూ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా వదిలింది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, కల్కి సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
lot of discussion happening on #Prabhas dialogues time from #Salaar . like Mrs Lata Neel said "when his shadow is equal to million dialogues". This is #Prabhas star power, people r loving #Salaar so much on OTT.
loved him as #Deva; eagerly waiting for #ShauryangaParvam pic.twitter.com/UFdd7k3mGh— Prabhas ❣️ Fan.Shouryanga Devratha in & as #Salaar (@fanofPrabha) January 21, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Duration of all the dialogues spoken by prabhas in the movie salaar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com