Update Aadhaar Card: ఆధార్ కార్డు ఉచిత అప్ డేట్ కు రేపు చివరి అవకాశం. దీంతో కేంద్రం ఇచ్చిన గడువును అందరు సద్వినియోగం చేసుకోవాలి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మార్చి 15 నుంచి జూన్ 14 వరకు ఉచితంగా అప్ డేట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దీంతో చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే రేపటి లోగా వాడుకోవచ్చు.
యూఐడీఏఐ నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఆధార్ కు సంబంధించిన వివరాలు అప్ డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను కొన్ని పత్రాలు సమర్పించుకోవాలి. ఉచిత సేవలు మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే వినియోగించుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవడానికి వీలుంటుంది. ఉచిత గడువు ముగిశాక మునుపటి లాగే రూ.50 చెల్లించి అప్ డేట్ చేసుకోవచ్చు.
http//myadhar.uidai.gov.in/ వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావచ్చు. రిజిస్టర్డ్ అప్ డేట్ అడ్రస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తరువాత డాక్యుమెంట్ అప్ డేట్ పై క్లిక్ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఒకవేళ సవరణ ఉంటే చేయాలి. లేదా వివరాలను సరిచూసుకుని నెక్ట్స్ పై క్లిక్ చేయాలి.
డ్రాప్ డౌన్ జాబితా నుంచి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను సెలెక్టు చేసుకోవాలి. డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్ లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీంతో అప్ డేట్ స్టేటస్ చెక్ చేసుకుంటే సరి. ఇలా ఆధార్ కార్డుకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిదే.