Pippi Pannu: మన నోటిలోని పళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఏదైనా నమలడం సాధ్యం అవుతుంది. అలా బాగా నమిలితేనే మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. అంతేకాని మనం సరిగా నమలకపోతే మనం తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బందులు ఏర్పడవచ్చు. దీంతో జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. పంటి ఆరోగ్యం సరిగా లేకపోతే అజీర్తి ఏర్పడి కడుపు ఉబ్బరం వంటివి వేధిస్తాయి.
ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నోటి శుభ్రత లేకపోతే పళ్లు పుచ్చిపోవడం జరుగుతుంది. నోటి దుర్వాసన వస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పళ్లు కోల్పోయే ఆస్కారం ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు వస్తే దంత వైద్యుడిని సంప్రదించాలి. వీలైనంత వరకు ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ ను సంప్రదించాలి. ఏదైనా సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలి.
పళ్లపై ఉండే ఎనామిల్ దెబ్బ తింటే పళ్లు పుచ్చిపోవడం జరుగుతుంది. దీంతో నరాలు దెబ్బతింటాయి. పుచ్చు ఇంకా లోపలకు వెళితే సిమెంట్ తో మూయాల్సి ఉంటుంది. ఇలా పుచ్చు పళ్లు రాకుండా చూసుకోవడమే మంచిది. పుచ్చు పళ్లు రాకుండా చూసుకోవడమే మంచిది. లేదంటే చాలా రకాల సమస్యలు వస్తాయి. నరాలలో చీము ఏర్పడితే శుభ్రం చేసి సిమెంట్ తో నింపుతారు.
ఆయుర్వేదంలో కూడా పుచ్చి పళ్లకు సంబంధించిన ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అల్లం ముక్కను నములుతూ రసం మింగితే పంటి ఆరోగ్యం బాగుపడుతుంది. అల్లంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుచ్చి పళ్లకు మంచి మందులా ఉపయోగపడుతుంది. చిగుళ్ల వాపును కూడా దూరం చేస్తుంది. ఇలా మనకు ఎన్నో రకాల పద్ధతులు పుచ్చు పళ్లు రాకుండా చేస్తాయి.