Sangli Murder Case: భర్తల హతాలు ఆగడం లేదు. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో ఈ తరహా దారుణాలు పెరిగిపోతున్నాయి.. కనీవినీ ఎరుగని స్థాయిలో ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. మేఘాలయ రాష్ట్రంలో ఇండోర్ ప్రాంతానికి చెందిన రఘువంశి ఘటనతో మొదలైన ఈ దారుణాలు వరుసగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దేశంలో పలు ప్రాంతాలలో అనేక ఘోరాలు జరిగాయి. ఈ సంఘటనలలో మొత్తం భార్యల చేతిలో భర్తలు హతం కావడం విశేషం. ఈ ఘటనలలో తమ ప్రియుళ్ల అండ చూసుకొని భార్యలు కట్టుకున్న భర్తలను అంతం చేయడం గమనార్హం. రోజుకో తీరుగా పలు ప్రాంతాలలో ఈ తరహా సంఘటనలు వెలుగు చూస్తున్నప్పటికీ.. నేరాలకు మాత్రం అడ్డుకట్ట పడకపోవడం విశేషం. ఇక తాజాగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య అత్యంత కిరాతకంగా అంతం చేసింది.
Also Read: మహిళల వాష్ రూమ్ లో కెమెరాలతో అశ్లీల వీడియోలు.. ఇన్ఫోసిస్ లో ఓ టెకీ పనులు.. దొరికాడిలా
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో అనిల్ లోకండే అనే 53 సంవత్సరాల వ్యక్తి ఉన్నాడు. ఇతరికి సరిగ్గా రెండు వారాల క్రితం 27 సంవత్సరాల రాధిక అనే యువతి తో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కొద్దిరోజులు బాగానే ఉన్నారు. దగ్గర్లో ఉన్న ఆలయాలకు వెళ్లి వచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో పడుకుని ఉన్న అనిల్ ను రాధిక గొడ్డలితో నరికి అంతం చేసింది. అయితే రాధికతో శారీరకంగా గడపడానికి అనిల్ పట్టుబట్టాడని.. అందువల్లే ఆమె ఈ హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే రాధిక కు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది. అనిల్ కు భారీగా ఆస్తులు ఉండడంతో అతడిని పెళ్లి చేసుకుందని.. అతడిని అంతం చేసి ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని రాధిక భావించిందని సమాచారం. అందువల్లే భర్తను అంతం చేసిందని తెలుస్తోంది. అనిల్ కు గతంలోని వివాహం జరిగింది. కాకపోతే మొదటి భార్య క్యాన్సర్ వ్యాధికి గురైంది. ఆ తర్వాత ఆమెను అనేక ఆసుపత్రులలో చూపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి చికిత్స పొందుతూ కన్ను మూసింది. భార్య కన్నుమూసిన కొద్ది సంవత్సరాల వరకు ఒంటరిగానే ఉన్నాడు. ఇటీవల బంధువుల ప్రోద్బలంతో 27 సంవత్సరాల రాధికను వివాహం చేసుకున్నాడు.
Also Read: జబర్దస్త్ నూకరాజుకు హ్యాండ్ ఇచ్చి అతన్ని పెళ్లి చేసుకున్న ఆసియా… స్టార్ కమెడియన్ గుండెపగిలిందే!
అనిల్ కు ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులను చూసే రాధిక తన వయసు 27 సంవత్సరాలు.. అతడికి 53 సంవత్సరాలు అయినప్పటికీ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన కొద్దిరోజుల వరకు రాధిక అనిల్ బాగానే ఉన్నారు. ఆ తర్వాతే రాధిక లో మార్పు వచ్చింది. తన అసలు రూపాన్ని భర్తకు చూపించడం మొదలుపెట్టింది. శారీరకంగా కలవడానికి భర్త తన వద్దకు వచ్చినప్పటికీ.. ఆమె ఒప్పుకునేది కాదు. మొదట్లో కొన్ని శారీరక ఇబ్బందులను తెలిపింది. ఆ తర్వాత అతడిని దూరం పెట్ట సాగింది. ఫోన్లో నిత్యం మాట్లాడుతూ ఉండేది. దీంతో అతనికి అనుమానం కలిగింది. ఇక మంగళవారం ఆమెతో శారీరకంగా గడపడానికి అనిల్ వెళ్ళాడు. వద్దని వారించడంతో అనిల్ ఇంట్లోనే ఓ మంచం మీద పడుకున్నాడు. భర్త మీద ఇష్టం లేక.. ప్రియుడితో కలిసి ఉండాలని భావించిన రాధిక ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొచ్చి అనిల్ మెడ మీద ఒక వేటువేసింది. దెబ్బకు అనిల్ రక్తపు మడుగులో కొట్టుకుంటూ కన్నుమూశాడు.. ఇక ఈ ఘటన తర్వాత పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. రాధికను అదుపులోకి తీసుకున్నారు. అయితే రాధిక ఫోన్ కాల్ డాటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. అనిల్ కు మొదటి భార్య ద్వారా సంతానం ఉందా? అనే విషయాలు తెలియ రాలేదు.