Bhanu Sree shocking comments: బిగ్ బాస్ షో(BIGG BOSS) వలన కొందరు ఫేమ్ రాబడితే మరికొందరు, ఉన్న ఫేమ్ కోల్పోయారు. ఈ షో చాలా ప్రమాదకరం అని నమ్మేవారు లేకపోలేదు. పేరున్న సెలెబ్స్ బిగ్ బాస్ షోలో కనిపించకపోవడానికి కారణం ఇదే. చాలా మంది సెలెబ్స్ నెగిటివిటీ మూటగట్టుకుని బయటకు వచ్చారు. అంతకు ముందు వారి మీదున్న ఇంప్రెషన్ కాస్తా ప్రేక్షకులకు పోయింది. సెలబ్రిటీల ప్రైవేట్ లైఫ్ జనాలకు తెలియదు. నిజ జీవితంలో వారు ఎలా ఉంటారో తెలిశాక, జనాలకు ఆసక్తిపోతుంది. వారు మనలాంటివారే అనే భావన కలుగుతుంది.
అదే సమయంలో బిగ్ బాస్ షో నిర్వాహకుల పెట్టే ఆంక్షలు, చేసే అగ్రిమెంట్స్ కఠినంగా ఉంటాయి. దాదాపు ఏడాది పాటు మరో ఛానల్ లో షో చేయకూడదనే నియమం ఉంది. స్టార్ మాలో మాత్రమే వారు షోలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఈ కారణంగా నష్టపోయాను అని నటి భానుశ్రీ చెప్పుకొచ్చింది. నటిగా కెరీర్ ఆరంభించిన భానుశ్రీ(BHANU SREE) కి బిగ్ బాస్ సీజన్ 2లో అవకాశం వచ్చింది. ఈ సీజన్ లో టాప్ సెలెబ్స్ కంటెస్ట్ చేశారు. వారితో పోల్చుకుంటే భానుశ్రీకి అంత ఫేమ్ లేదు.
Also Read: రామాయణం కోసం ఆ నటిని రణబీర్ కపూర్ రికమండ్ చేశారా?
నాని హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో భానుశ్రీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆమెకు ఫైనల్ లో కూడా ఛాన్స్ దక్కలేదు. అయితే గతంతో పోల్చితే కొంత పాపులారిటీ రాబట్టింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక తనకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ వస్తాయని భానుశ్రీ భావించింది. అనుకున్నట్లే మోస్ట్ పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో ఢీ లో మెంటర్ గా ఛాన్స్ దక్కింది. రెండు మూడు ఎపిసోడ్స్ చేశాక, స్టార్ మా వాళ్ళు ఆ షో నుండి తప్పుకోవాలని అన్నారట. మొదట్లో ఒప్పుకున్న స్టార్ మా యాజమాన్యం తర్వాత నిరాకరించారట. దాంతో తన కలలు చెల్లాచెదురు అయ్యాయని భానుశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Also Read: జబర్దస్త్ నూకరాజుకు హ్యాండ్ ఇచ్చి అతన్ని పెళ్లి చేసుకున్న ఆసియా… స్టార్ కమెడియన్ గుండెపగిలిందే!
భానుశ్రీ పలు చిత్రాల్లో నటించడం విశేషం. బాహుబలి సినిమాలో చిన్న పాత్ర చేసింది. తమన్నా డూప్ గా కూడా చేసినట్లు వెల్లడించడం విశేషం. మర్లపులి, ఇద్దరి మధ్య 18, కాటమరాయుడు చిత్రాల్లో భానుశ్రీ నటించింది. ప్రస్తుతం బుల్లితెర షోలలో సందడి చేస్తుంది.