Ram Mandir: సాధారణంగా హిందూ దేవాలయాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఉచిత దర్శనాలు అమలవుతాయి. ఇక తిరుపతి లాంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో అయితే ఉచిత దర్శనంతో పాటు రుసుము స్వీకరించి కూడా భక్తులకు దర్శనం భాగ్యం కల్పిస్తారు. తిరుపతి మాత్రమే కాదు చాలా ఆధ్యాత్మిక క్షేత్రాలలో.. ముఖ్యంగా బాగా ప్రాచుర్యం పొందిన ఆలయాల్లో రుసుములు స్వీకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించే సంప్రదాయం ఉంది. అయితే నిన్న ప్రారంభమైన అయోధ్యలోని రామాలయంలో కూడా ఇదే పద్ధతి అనుసరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ మంగళవారం బాలరాముడి దర్శనాన్ని భక్తులకు కల్పించడం మొదలు పెట్టిన తర్వాత రామ జన్మభూమి ట్రస్ట్ వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాముడి దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఎన్ని లక్షల మంది వచ్చినా స్వామివారి దర్శనాన్ని ఉచితంగానే కల్పిస్తామని వివరించింది. అంతేకాదు దేశ విదేశాలను చూచే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కాకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది.
బాల రాముడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం కూడా ఉచితంగా వస్తే కల్పించే ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు ట్రస్ట్ బాధ్యులు చెప్తున్నారు.. అంతేకాదు రాముడి ప్రసాదంగా లడ్డూను కూడా ఉచితంగానే అందజేస్తున్నామని వారు వివరించారు.. మంగళవారం స్వామివారి దర్శనానికి సంబంధించి భక్తులను అనుమతించడంతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. అంతే కాదు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వివిధ ధార్మిక సంస్థలు అన్నదానాలు చేస్తున్నాయి.. వాస్తవానికి రాముడి ఆలయం ప్రారంభమైన తర్వాత స్వామివారి దర్శనానికి సంబంధించి రుసుము వసూలు చేస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే రాముడి ఆలయ నిర్మాణానికి సంబంధించి విరాళాలు రావడంతో.. రామజన్మ భూమి ట్రస్ట్ భక్తులకు ఉచిత దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. రాముడు అందరివాడు. ఆయనను దర్శించుకునేందుకు అందరూ వస్తారు. ఆ భాగ్యాన్ని మేము అందరికీ కల్పిస్తాం. రాముడి కోవెలలో తారతమ్యాలకు తావు లేదని రామ జన్మభూమి ట్రస్ట్ బాధ్యులు చెబుతున్నారు.
స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కల్పించే వసతి విషయంలోను ఉచితం వైపే రామ జన్మభూమి ట్రస్ట్ మొగ్గు చూపుతున్నది. సరయు నది తీరంలో విశాలమైన కాటేజీలు నిర్మించాలని భావిస్తున్నది. కేంద్రం కూడా అయోధ్య నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడం.. భక్తులు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రామ జన్మ భూమి ట్రస్ట్ బాధ్యులు సత్రాలు నిర్మించాలని భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం వాటిని ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు.. అంతేకాదు రామాలయం నిర్మించిన విధంగానే సత్రాల నిర్మాణ బాధ్యతను కూడా చేపడతామని రామజన్మ ట్రస్ట్ సభ్యులు పేర్కొంటున్నారు. రామాలయాన్ని నిర్మించిన సంస్థలో ఒకటైన ఎల్ అండ్ టీ కే ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్నది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ram janmabhoomi trust is a key decision
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com