Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: షర్మిల చంద్రబాబు స్టార్ క్యాంపైనర్.. జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan: షర్మిల చంద్రబాబు స్టార్ క్యాంపైనర్.. జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan: ఏపీలో అసలు సిసలు రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటివరకు జగన్ కు ప్రత్యర్థులుగా చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలు ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి వైఎస్ షర్మిల వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె రాష్ట్ర పగ్గాలు అందుకున్నారు. ఈ సందర్భంగా సోదరుడు జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ప్రారంభించారు. అయితే రెండు రోజుల పాటు జగన్ ఓపిక పట్టారు. కానీ ఈరోజు సోదరి షర్మిల పై బ్లాస్ట్ అయ్యారు. ఆమె పేరు పెట్టకుండానే కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో చేరిక, పీసీసీ పగ్గాలు అందుకునే క్రమంలో షర్మిల చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. ఇక జగన్ తో యుద్ధమేనని సంకేతాలు ఇచ్చారు. అయితే ఆమె కామెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మరో కీలక నేత వైవి సుబ్బారెడ్డి మాత్రమే స్పందించారు. ఆమె ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని.. ఆమె వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆ ఇద్దరు నేతలు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి షర్మిలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దీనిపై షర్మిల ఘాటుగానే రిప్లయ్ ఇచ్చారు. తనతో వస్తే ప్రభుత్వ వైఫల్యాలను చూపిస్తానని.. మీడియాను సైతం తెస్తానని సవాల్ చేశారు.అంతటితో ఆగకుండా ఇకనుంచి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటానని.. వైసీపీ నేతల దోపిడీ, అవినీతిని బయటపెడతానని హెచ్చరికలు పంపారు.

షర్మిల డోసు పెంచడంతో జగన్ లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. అందుకే షర్మిల కు కౌంటర్ అటాక్ ఇవ్వాలని భావించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ లో వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి జగన్ హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ తో పాటు షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఎంతో మంది స్టార్ క్యాంపైనర్లు ఉన్నారని.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చారని.. రాష్ట్రాన్ని విభజించిన పార్టీల్లో చేరారని.. బిజెపిలో తాత్కాలికంగా తలదాచుకున్నారని.. వీరంతా చంద్రబాబు స్టార్ క్యాంపైనర్లు అని ఎద్దేవా చేశారు. అంతటితో ఆగని జగన్ జెండాలు జతకట్టడమే వారి అజెండా అని.. ప్రజల గుండెల్లో గుడి కట్టడమే తన అజెండా అని చమత్కరించారు. తనకు ప్రజలే స్టార్ క్యాంపైనర్లు అని తేల్చి చెప్పారు.

పీసీసీ పగ్గాలు తీసుకున్న తర్వాత షర్మిల ఈరోజు నుంచి రాష్ట్ర పర్యటనలకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆర్టీసీ పల్లె వెలుగులో ప్రయాణించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తన కాన్వాయ్ ని ఆపి పలాసలో పల్లె వెలుగు ఎక్కిన ఆమె.. ఇచ్చాపురం వరకు ప్రయాణించారు. ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ పథకాల అమలు గురించి ఆరా తీశారు. జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. సరిగ్గా అదే సమయంలో సోదరుడు జగన్ అనంతపురంలో సౌండ్ చేశారు. షర్మిలను టార్గెట్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే అన్నా చెల్లెలి మధ్య గట్టి పోరాటం ఉంటుందని ఇరువురు సంకేతాలు పంపారు. మున్ముందు విమర్శల డోసు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలది వీటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular