Rahul Gandhi : మోడీ ఇంటిపేరున్న వారు దొంగలు వ్యాఖ్యానించి కోర్టులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు జైలు శిక్ష పడడంతో ఎంపీ సభ్యత్వం అనర్హత వేటు వేసింది పార్లమెంట్. ఆయన్ను పార్లమెంట్ లోకి అడుగుపెట్టకుండా చేసింది. కానీ ఇప్పుడు ఈ కేసుపై సుప్రీంకోర్టు స్టే విధించి రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
రాహుల్ గాంధీకి పెద్ద ఉపశమనం లభించింది. 2019 క్రిమినల్ పరువునష్టం కేసులో “మోదీ ఇంటిపేరు గల వారంతా దొంగలు” అని వ్యాఖ్యానించినందుకు గాను విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్ గాంధీ ఎంపీ సీటుపై అనర్హత వేటు కూడా రద్దు అవుతుంది. ఈ నిర్ణయంతో పార్లమెంట్లోకి అడుగుపెట్టకుండా కేంద్రం విధించిన అనర్హత వేటు కూడా తొలిగిపోనుంది. ఆయన పార్లమెంటు సభ్యుడి హోదాను పునరుద్ధరిస్తారు. ఇక దర్జాగా పార్లమెంట్ లోకి అడుగుపెట్టొచ్చు. కర్ణాటకలో ఎన్నికల ర్యాలీలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ గుజరాత్ ప్రభుత్వ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పరువు నష్టం కేసు వేశారు.
రాహుల్ గాంధీ ప్రసంగంలో పేర్కొన్న వ్యక్తులు ఎవరూ అతనిపై దావా వేయలేదని.. కేవలం బిజెపి నేతలు మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ కేసు వేయడం విచిత్రంగా ఉందని రాహుల్ గాంధీ న్యాయ బృందం వాదించింది. బాధిత వ్యక్తుల గుర్తింపును వారు ప్రశ్నించారు.
పూర్ణేష్ మోదీ తరపున పిటిషనర్, సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదిస్తూ.. సాక్ష్యాలను పునఃపరిశీలించకుండానే స్టే విధించారని, శిక్షను తిరస్కరించడానికి బలమైన అంశం అవసరమని అన్నారు.
విచారణ సమయంలో జస్టిస్ బీఆర్ గవాయ్ గాంధీ ‘లోక్ సభ సభ్యుడిగా అనర్హత వేటు విధించడానికి గల కారణాలను దిగువ కోర్టు న్యాయమూర్తి వెల్లడించలేకపోయారని’ వ్యాఖ్యానించారు. తుది తీర్పు పెండింగ్ లో ఉన్నందున దోషిగా నిర్ధారించేవరకూ రాహుల్ గాంధీపై జారీ చేసిన క్రిమినల్ పరువునష్టం దావా ఉత్తర్వులను నిలిపివేయనున్నట్టు ఆదేశించారు.
పూర్ణేష్ మోదీ తరుఫు వారు మాత్రం.. ‘రాహుల్ గాంధీ తన అఫిడవిట్‌లోని వ్యాఖ్యకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారని.. తన నిర్దోషిత్వాన్ని కొనసాగించారని పునరుద్ఘాటించారు. ఈ కేసు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసిందన్నారు.
సుప్రీంకోర్టు నిర్ణయంతో రాహుల్ గాంధీ ఇప్పుడు పార్లమెంటులో సభ్యుడిగా కొనసాగవచ్చు. ఈ న్యాయ పోరాటంలో రాహుల్ కు గణనీయమైన ఉపశమనం లభించినట్టైంది.