Hardik Pandya
Hardik Pandya: ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరగనున్న భారత్ తొలి టీ20 మాచ్ ఆరంభానికి ముందు టీమ్ ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండే భావోద్వేగానికి గురి అయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో ఉబికి వస్తున్న కన్నీరుని ఆపుకోలేక పోయాడు హార్థిక్. అలా కన్నీరు తుడుచుకుంటూ ఉన్న టీమ్ ఇండియా కెప్టెన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వెండిస్తో జరుగుతున్నటువంటి ఈ టి20 సిరీస్ కు రోహిత్ శర్మ దూరం కావడం కారణంగా భారత్ జట్టు సారథ్యం వహించే బాధ్యత హార్దిక్ పాండ్యా కు దక్కింది. అయితే వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా.. జాతీయగీతం ఆలకిస్తున్న సమయంలో తన కెరియర్ లోని ఆటుపోట్లు గుర్తు చేసుకున్న హార్దిక్ కన్నీటి పర్యంతమయ్యాడు. టీమిండియా ఆడుతున్న 200 అంతర్జాతీయ టి20 మ్యాచ్ కు తాను కెప్టెన్ గా వ్యవహరించడం హార్దిక్ గర్వంగా భావిస్తున్నాడు.
ఈ క్రమంలోనే తన కెరియర్లో ఎదుర్కొన్నటువంటి కష్టాలు గుర్తు చేసుకుని ఉంటాడు. అయితే తాను సాధించిన ఇంత గొప్ప విజయాన్ని చూడడానికి తండ్రి లేడు అన్న భావనతో అతను భావోద్వేగానికి గురి అయ్యాడు. ఇది హార్దిక్ గురించి బాగా తెలిసిన కొందరి అభిప్రాయం. అయితే మరికొందరు ఈ విషయాన్ని కూడా ఎంతో నెగటివ్గా ప్రచారం చేస్తున్నారు.
హార్థిక్ ఎమోషనల్ ఫోటోను క్రికెట్ అభిమాని ముఫద్ధల్ ఓహ్రా పోస్ట్ చేశారు. దానితో పాటుగా జాతీయగీతం ఆలపిస్తుండగా హార్దిక్ ఎమోషనల్ అయ్యాడు అని క్యాప్షన్ కూడా పెట్టారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిపై సెటైర్లు కురిపిస్తుంటే మరికొందరు పాజిటివ్గా స్పందిస్తున్నారు. మంచి నటుడు దాగి ఉన్నాడని, ఎమోషనల్ అయ్యాడా లేక కళ్ళలో పడిన దుమ్మును తుడుచుకుంటున్నాడా.., ముసలి కన్నీరు కారుస్తున్నాడు..ఇలా తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.
మొదటినుంచి మ్యాచ్ బాగా ఆడుతున్నప్పటికీ అనుకోని విధంగా జరిగిన కొన్ని చిన్న తప్పిదాల కారణంగా భారత్ ఈ మ్యాచ్ ని ఓడిపోయింది. పటిష్టంగా నిలబడాల్సిన మిడిల్ ఆర్డర్ తడబడింది. అయితే ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ 2 సిక్సులు వరుసగా కొట్టి తన అంతర్జాతీయ పరుగుల ఖాతాను ఘనంగా ఓపెన్ చేశాడు. ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూ కొత్త ప్రయోగాలు అని చెప్పుకుంటూ దాటి వేస్తున్న టీమ్ ఇండియా కెప్టెన్ మరియు కోచ్ వ్యవహార తీరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు రకాల విమర్శలు తలెత్తుతున్నాయి.
ఇక మ్యాచ్ సంగతి కి వస్తే.. పిండి చేతులలో నాలుగు పరుగుల తేడాతో భారత్ చట్టం ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. నిజానికి ఇది ఇండియన్ ప్లేయర్స్ చేదించలేనంత గొప్ప స్కోరు అయితే కాదు. విజయం ఎంతో సులభమని కాన్ఫిడెంట్గా బరిలోకి దిగిన టీం ఓటమి ఎదుర్కొంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అక్కడకు రావలసిన బ్యాటర్స్ పెవెలియన్ కే పరిమితమయ్యారు. ఒక తిలక్ వర్మ తప్ప మిగిలిన అందరూ బ్యాటర్లు విఫలమయ్యారు అని చెప్పవచ్చు. మ్యాచ్ అనంతరం హార్దిక్ అనుకోకుండా జరిగిన కొన్ని తప్పిదాల కారణంగా మ్యాచ్ చేయిజారిపోయిందని.. ఒక నాలుగు బలమైన షార్ట్ లు పడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. ఇక రాబోయే మ్యాచ్లో కచ్చితంగా రానిస్తామని కూడా చెప్పారు. భారత్ వర్సెస్ విండీస్ రెండో టీ20 మ్యాచ్ ఆగస్టు 6న గయానా లో జరగనుంది.
మరి హార్థిక్ పాండ్యా చెప్పినట్లు టీం ఇండియా ఈ మ్యాచ్ లో అయినా గెలుస్తారా… లేక మరొక కొత్త కారణం వెతుకుతారా… అనేది 6 వ తారీఖున తేలుతుంది.
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
Read MoreWeb Title: First t20 against west indies hardik pandya cried what happened
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com