Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము దూసుకుపోతోంది. అందరు ఊహించినట్లుగానే భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ప్రకటించిన ఎంపీ ఓట్ల ఫలితాల్లో ద్రౌపది ముర్ము 540 ఓట్లు సాధించి బ్రహ్మాండమైన మెజార్టీ సాధించడం గమనార్హం. ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. దీంతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావడం ఖాయమనే తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె స్వగ్రామంలో సంబరాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

763 మంది పార్లమెంట్ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 15 ఓట్లు చెల్లకుండా పోయాయి. 748 పోలైన ఓట్లలో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు రాగా యశ్వంత్ సిన్హాకు 208 వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో ఎంపీ విలువ 700గా గుర్తించారు. అంటే ద్రౌపది ముర్ముకు వచ్చిన విలువ 3,78,000గా ఉండగా యశ్వంత్ సిన్హాకు వచ్చిన ఓట్ల విలువ 1,45,600గా నిర్ణయించారు. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తయినందున ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని పేర్కొన్నారు.
Also Read: PM Modi: వారి అనైక్యతే మోదీ బలం.. ఢీకొట్టలేకపోతున్న విపక్షాలు
పది రాష్ట్రాల లెక్కింపు తరువాత పోలింగ్ సరళిని మరోసారి వెల్లడిస్తారు. దీంతో అందరి దృష్టి కౌంటింగ్ మీదనే ఉంది. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారనే దానిపై అనుమానం లేకున్నా ఫలితం ప్రకటిస్తే ఎన్నిక లాంఛనమే. మొత్తానికి ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పీఠం అధిరోహించబోతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ క్రమంలో తుది ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. పది రాష్ట్రాల లెక్కింపు తరువాత మళ్లీ ఓటింగ్ సరళి ప్రకటిస్తారు. అంటే ఎమ్మెల్యేల ఓట్లకు మూడు సార్లు ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఒడిశాలోని ముర్ము స్వగ్రామంతోపాటు రాష్ట్రమంతా సంబరాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ముర్ము విజయం ఖాయమైన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించనున్నారు. గిరిజన మహిళ, పైగా తమ రాష్ట్ర వనిత కావడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ద్రౌపది ముర్ము ఎన్నిక ఎన్నో రికార్డులు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ లో కూడా మహిళలకు మంచి స్థానం దక్కుతుందనే ఆశాభావం అందరిలో కనిపిస్తోంది.
Also Read:Adani Singareni: సింగరేణిలోకి అదానీ ఎంట్రీ.. కేసీఆర్ కు ముందే తెలుసా..?
[…] Also Read: Presidential Election: ఆధిక్యం దిశగా ముర్ము.. వెనుకబ… […]