PM Modi: దేశంలో ప్రధాని నరేంద్రమోదీ బలంగా తయారవుతున్నారు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది.. ఎవరు ఇస్తున్నారు అంటే కచ్చితంగా విపక్షాలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, విపక్షాల అనైక్యతే మోదీని స్ట్రాంగ్‌గా చేస్తుందని, విపక్షాలను బలహీన పర్చడంలో బీజేపీ ఎత్తుగడ విజయవంత అవుతుండగా, విపక్షాల ఐకమత్యం బలహీనపడుతోంది. విపక్ష కూటమి విచ్చిన్నమవుతోంది.

నాడు కాంగ్రెస్‌పై ఐక్య పోరు..
పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ దేశంలో, ఇటు రాష్ట్రల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రాల నుంచి కేంద్రం వరకు పాలించింది. నాడు కాంగ్రెస్‌ను ఓడించేందుకు విపక్షాలు చాలా కష్టపడ్డాయి. కొన్నేళ్ల శ్రమ తర్వాత కాంగ్రెస్‌ను గద్దె దించగలిగారు. ఇందు కోసం యనైటెడ్ ప్రంట్, ఐక్య కూటమి, నేషననల్ ఫ్రంట్, ఎన్డీఏ ఇలా రకరకాల కూటములు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌ను బలహీన పర్చడంలో, ఓడించడంలో విజయవంతంఅయ్యయి. కానీ పదేళ్లుగా దేశంలో నరేంద్రమోదీ నాయకత్వంలో రోజు రోజుకూ బలపడుతున్న ఢీకొట్టడంలో మాత్రం విఫలమవుతన్నాయి. కారణం వారి మధ్య అననైక్యత, సొంత ఎజెండాలే కారణం.
Also Read: Adani Singareni: సింగరేణిలోకి అదానీ ఎంట్రీ.. కేసీఆర్ కు ముందే తెలుసా..?
రాష్ట్రపతి ఎన్నికల్లో తలోదారి..
ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నిల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ద్రౌపది ముర్మును, విపక్షాలు యశ్వంత్ సిన్హాను అభ్యర్థులుగా నిలిపాయి. ముర్మును ఎన్డీఏ కూట మిలో ఎవరూ వ్యతిరేకించలేదు. ఈ కూటమిలోని ఏ పక్షం కూడా యశ్వంత్‌కు మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇక విపక్షాలు, ఎన్డీఏ, యూపీఏ యేతర పార్టీలు మాత్రం ముర్ముకు మద్దతు ఇచ్చాయి. ఇందుకు వారి సొంత కారణాలు, కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దనుకోవడం, అభ్యర్థి ఎంపిక సరైందని భావించడం ప్రధాన కారణాలు. ఓడిషాలోని బీజూజనతాదళ్, ఆంద్రప్రదేశ్‌లోని వైస్సార్ సీపీ, టీడీపీ, జార్ఖండ్‌లో జేఎంఎం, ఉత్తర ప్రదేశ్‌లోని బీఎస్పీ ముర్ముకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. చివరకు ఎన్డీఏకు వ్యతిరేకమైన శివసేన కూడా ముర్ముకు మద్దతు తెలిసింది. ఇక విపక్షాలకు టీఆర్‌ఎస్, ఆప్ మినహా ఇతరులెవరూ ముందుకు రాలేదు.

ఉమ్మడి పోరులలో విఫలం..
కేంద్రంపై కలిసికట్టుగా పోరాడడంలలో విపక్షాలు విఫలమవుతున్నాయి. ఇందుకు వేర్వేరు కారణాలు ఉన్నాయి. కొన్ని వ్యక్తిగత ఎజెండా, ఇంకొన్ని ఎందుకే మనకు అనే వైఖరి, మరికొన్ని స్తభ్దుగా ఉండడం వలన మోదీ నేతృత్వంలో ఎన్డీఏ బలపడుతోంది. ప్రభుత్వాలను కూల్చినా, పార్టీలను చీల్చినా ఏమీ చేయలేక నిస్సహాయంగా చూసే పరిస్థితిని మోదీ కల్పించగలుగుతున్నారు. విపక్షాల అనైక్యతను గుర్తించే కేసీఆర్ ఉమ్మడిగా కొట్లాడలేమని భావించారు. అందుకే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తామన్నారు. కానీ అది కూడా సాధ్యమయ్యేలా కనిపిండం లేదు. మొత్తంగా మోదీ బలపడేందుకు విపక్షాల బలహీనతే ప్రధాన కారణమని చెప్పవచ్చు.
Also Read:Presidential Election 2022 Results: ఉత్కంఠ: కాబోయే రాష్ట్రపతి ఎవరు..? కౌంటింగ్ షురూ..
[…] […]