https://oktelugu.com/

మన ఆన్ లైన్ చదువులు.. విద్యార్థులకు మంచివా? చెడ్డవా?

చూసి చూసి మన పిల్లలు కళ్లు మండుతున్నాయి. ఫోన్లు, టాబ్, కంప్యూటర్ స్క్రీన్లను రోజంతా చూస్తూ విద్యార్థుల మైండ్ లు హీటెక్కుతున్నాయి. క్రియేటివిటీ చచ్చిపోయి అందరికీ కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. కరోనా వైరస్ పుణ్యమాని ఇప్పుడు విద్యార్థులందరికీ ఆన్ లైన్ చదువులు పెను భారమవుతున్నాయి. Also Read: ఇంతకన్నా నీచం ఉంటుందా? కులాల వారిగా క్వారంటైన్ సెంటర్లు కరోనా వైరస్ తో మన పిల్లలు చదవులు అటకెక్కాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేవంట.. వ్యాక్సిన్ వస్తేనే మళ్లీ చదువులు […]

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2020 / 11:36 AM IST
    Follow us on


    చూసి చూసి మన పిల్లలు కళ్లు మండుతున్నాయి. ఫోన్లు, టాబ్, కంప్యూటర్ స్క్రీన్లను రోజంతా చూస్తూ విద్యార్థుల మైండ్ లు హీటెక్కుతున్నాయి. క్రియేటివిటీ చచ్చిపోయి అందరికీ కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. కరోనా వైరస్ పుణ్యమాని ఇప్పుడు విద్యార్థులందరికీ ఆన్ లైన్ చదువులు పెను భారమవుతున్నాయి.

    Also Read: ఇంతకన్నా నీచం ఉంటుందా? కులాల వారిగా క్వారంటైన్ సెంటర్లు

    కరోనా వైరస్ తో మన పిల్లలు చదవులు అటకెక్కాయి. ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేవంట.. వ్యాక్సిన్ వస్తేనే మళ్లీ చదువులు చక్కబడే చాన్స్. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు మొత్తం ఆన్ లైన్ చదువులతో నెట్టుకొస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలైతే మొత్తం అందులోనే బోధించేస్తున్నాయి. అయితే ఈ విద్యావిధానం విద్యార్థులకు అలవడిందా? వారికి సౌకర్యంగా ఉందా అనే దానిపై తాజాగా జాతీయ విద్యాపరిశోధన మరియు శిక్షణ సంస్థ ( ఎన్సీఈఆర్టీ) సర్వే నిర్వహించింది.

    ఆన్ లైన్ విద్యా విధానంతో సర్వేలో పాల్గొన్న 50శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇక క్లాసులకు హాజరు కావాలంటే ఇంటర్నెట్, సిగ్నల్స్, అప్ లోడ్ ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెబుతున్నారు. ఇక విద్యార్థులకే కాదు టీచర్లకు కూడా ఈ కొత్త సిస్టంతో చికాకులే.. పాఠాలను వీడియో కెమెరాను చూసి చెప్పాల్సి రావడం.. పిల్లలకు అర్థం అవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇక పిల్లలకు పాఠాల్లో డౌట్లు వస్తే అంతే సంగతులు. ఇలా బాలారిష్టలతో సాగుతున్న ఆన్ లైన్ చదువులు విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులకు పెను భారమవుతున్నాయి.

    విద్యార్థులకు ఆన్ లైన్ చదువులతో చుక్కలు కనిపిస్తున్నాయని సర్వేలో తేలింది. స్కూళ్లతో పోలిస్తే ఇళ్లలో ఉండే సౌకర్యాల కొరతతో పాటు ఇతర సమస్యలూ విద్యార్థులను వేధిస్తున్నాయి. ఆన్ లైన్ చదువులు మొక్కుబడిగా సాగుతున్నాయని తేలింది.

    Also Read: జగన్ కి ముందుంది ముసళ్ళ పండుగ..? కేసీఆర్ కాస్కొని ఉన్నాడు

    విద్యార్థులకు ఇళ్ల వద్ద ఉండే వాతావరణంతోపాటు కరెంట్ కోతలు.. ఆన్ లైన్ విద్యకు అవసరమైన ఫోన్ , ట్యాబ్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల కొరత ఉందని కేంద్రం సర్వేలో తెలిపింది. 27శాతం మంది విద్యార్థులు కరెంట్ కోతలతో.. 28శాతం విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల కొరతను ఎదుర్కొంటున్నట్టు సర్వేలో తేలింది.

    మొత్తం కరోనా చేయబట్టి ఆన్ లైన్ చదువులతో విద్యార్థుల బుర్రలు హీటెక్కుతున్నాయి. వారికి పాఠాలు అంతగా అర్థం కావడం లేదని సర్వేలో తేలింది. ఇలానే సాగితే మన విద్యార్థుల శక్తి సామర్థ్యాలు కనుమరుగైపోతాయి. అందుకే ఆన్ లైన్ విద్యావిధానంపై సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం మార్గదర్శకాలు రెడీ చేయడానికి సిద్ధమైంది. ఈ విధానం లోపభూయిష్టం అని తేలడంతో కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది..

    -ఎన్నం