సీపీ రివార్డు ప్రకటన సరైందేనా?

స్వర్ణా ప్యాలెస్ క్వారంటైన్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి బాధ్యులను అరెస్టు చేసే పనిలో పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ వ్యవహారంలో రమేష్ ఆసుపత్రికి చెందిన కొందరిని ఇప్పటికే విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అయితే రమేష్ ఆసుపత్రి అధినేత రమేష్ కుమార్ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కీలక నింధితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డ్ అందజేస్తామని విజయవాడ సీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. Also […]

Written By: Neelambaram, Updated On : August 21, 2020 11:49 am
Follow us on


స్వర్ణా ప్యాలెస్ క్వారంటైన్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి బాధ్యులను అరెస్టు చేసే పనిలో పోలీసుల ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ వ్యవహారంలో రమేష్ ఆసుపత్రికి చెందిన కొందరిని ఇప్పటికే విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అయితే రమేష్ ఆసుపత్రి అధినేత రమేష్ కుమార్ మాత్రం పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కీలక నింధితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డ్ అందజేస్తామని విజయవాడ సీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

Also Read: ఇంతకన్నా నీచం ఉంటుందా? కులాల వారిగా క్వారంటైన్ సెంటర్లు

స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంలో అక్కడ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు, నిర్వహణ విషయంలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం ఉంది. అయితే ఆసుపత్రి అధినేత రమేష్ కుమార్ పై రివార్డు ప్రకటించడానికి ఆయన నక్సలైట్ లేక ఉగ్రవాది కాదు. వైద్యం చేసి డబ్బు తీసుకున్నా… దశాబ్దాలుగా ఎంతో మందికి గుండె చికిత్సలు చేసి ప్రాణాలు కాపాడిన వైద్యుడు. ఆ కోణంలోను పోలీసులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వర్ణా ప్యాలెస్ ప్రమాదం విషయంలో ఆసుపత్రి నిర్లక్ష్యానికి రమేష్ కుమార్ ని బాధ్యుణ్ని చేయడం తప్పు కానప్పటికీ… ఇన్ని రోజులుగా ఆయన ఆచూకీ కనుగొన లేకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నించాల్సి వస్తుంది.

విజయవాడ పోలీసులు రమేష్ కుమార్ ఆచూకీ తెలుసుకోకపోవడంలో విఫలమవడం ఒక అంశమైతే, రమేష్ కుమార్ ఆచూకి చెబితే రూ.లక్ష అందజేస్తామంటూ రివార్డు ప్రకటించడం మరో తప్పిదంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఐఎంఎ వంటి సంఘాలు స్వర్ణా ప్యాలెస్ ప్రమాదం విషయంలో పూర్తిగా ఆసుపత్రి యాజమాన్యాన్నే బాధ్యులను చేయడం సరైంది కాదని విమర్శిస్తున్నాయి. హోటల్ యాజమాన్యం బాధ్యత, అనుమతులు ఇచ్చిన అధికారుల బాధ్యత ఉంటుందని అంటున్నారు.

Also Read: భారతదేశంలోని టాప్ – 50 ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ మహిళా నేత!

కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీలకు మధ్య కొన్ని రోజులుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. తాజాగా విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు రివార్డు ప్రకటనతో ఈ అంశం మరింత వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.