Israel And India: ప్రపంచంలో కొన్నేళ్లుగా భారత్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. ప్రస్తుతం ఆర్థికంగా నాలుగో స్థానంలో ఉన్నాం. దీంతో మనకు శత్రువులు పెరుగుతున్నారు. మన ఎదుగుదలను ఓర్వడం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా వంటి దేశాలు మనల్ని కిందకు లాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో భారత్ కూడా సైనికంగా బలపడుతోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఆయుధాలు తయారు చేస్తోంది. మరోవైపు భారత్ విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్‌తో డీల్ కుదిరింది.
40 వేల మెషీన్ గన్స్..
ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ (ఐడబ్ల్యూఐ) ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో దాదాపు 40 వేల లైట్ మెషిన్ గన్స్ భారత సైన్యంకు అందించడానికి సిద్ధమవుతోంది. ఈ ఆయుధాల సరఫరా కోసం సంబంధిత పరీక్షలు, అనుమతులు పూర్తయ్యాయి. భారత హోంశాఖతో ఈ ఒప్పందం చర్చలను చేపట్టిన ఐడబ్ల్యూఐ త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
1.70 లక్షల కార్బైన్లపై ఒప్పందం..
క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ (సీక్యూబీ) కార్బైన్స్ టెండర్లో భారత్ ఫోర్జ్ ప్రాథమిక బిడ్డర్ కాగా, ఐడబ్ల్యూఐ సంస్థ రెండో స్థానంలో ఉంది. 1.70 లక్షల కార్బైన్ ఆయుధాల సరఫరా ఒప్పందం నాటికి సంతకాలతో పూర్తవుతుంది. అందులో 60 శాతాన్ని భారత్ ఫోర్జ్, మిగతా 40 శాతాన్ని అదానీ గ్రూపు అనుబంధ సంస్థ పీఎల్‌ఆర్ సిస్టమ్స్ పంపిణీ చేసే అవకాశం ఉంది.
అర్బెల్ టెక్నాలజీ..
అర్బెల్ సాంకేతికత అనేది వరల్డ్‌లో ప్రథమ కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్. ఇందులో ఉన్న అధునాతన సెన్సర్లు, రియల్ టైమ్ బాలిస్టిక్ కమ్యూటేషన్ సామర్థ్యం ద్వారా సైనికులు అత్యధిక ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలరు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ అల్గోరిథంతో ఈ టెక్నాలజీ ఆయుధం లక్ష్యాన్ని వేగంగా, తీక్షణంగా గుర్తించి తదుపరి నిషేధాలు కూడా ఆ నిర్వహణను మెరుగుపరిచే విధంగా పనిచేస్తుంది.
భారతదేశంలో తయారీ ప్రణాళిక..
ఐడబ్ల్యూఐ సీఈవో షుకీ స్క్వాట్జ్ ప్రకారం, ఈ ఆధునిక ఆయుధాల బ్రాహత్ లో కూడా తయారీకి దారులు ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. తద్వారా దేశీయ నిర్వాహణ సామర్థ్యం పెరిగి, సైనిక సామర్థ్యం మరింత బలపడనుంది.
భారత సైన్యంలో ఈ ఆధునిక ఆయుధాల ప్రవేశంతో యుద్ధవేదికపై సంచలనం సృష్టించే అవకాశం ఉంది. దేశ రక్షణకు కొత్త మైలురాయి వేసే పథకం అనిపిస్తోంది.