https://oktelugu.com/

పూజా హెగ్డేకి 2 కోట్లు కావాలట !

టాలీవుడ్ లో గత నాలుగైదు సంవత్సరాలుగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పూజా ఖాతాలో వరుసగా ‘అరవింద సమేత, మహర్షి’ ‘గద్దలకొండ గణేష్’, లాంటి విజయాలతో పాటు అన్నిటికి మించి ‘అల వైకుంఠపురంలో’ అనే ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. దీంతో ఈ మధ్య ఈ టాల్ బ్యూటీకి డిమాండ్ బాగా పెరిగిందట. పైగా ప్రస్తుతం టాప్ హీరోయిన్ ల లిస్ట్ కూడా తక్కువగా ఉండటం.. ఉన్న […]

Written By:
  • admin
  • , Updated On : August 21, 2020 / 11:24 AM IST
    Follow us on


    టాలీవుడ్ లో గత నాలుగైదు సంవత్సరాలుగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పూజా ఖాతాలో వరుసగా ‘అరవింద సమేత, మహర్షి’ ‘గద్దలకొండ గణేష్’, లాంటి విజయాలతో పాటు అన్నిటికి మించి ‘అల వైకుంఠపురంలో’ అనే ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. దీంతో ఈ మధ్య ఈ టాల్ బ్యూటీకి డిమాండ్ బాగా పెరిగిందట. పైగా ప్రస్తుతం టాప్ హీరోయిన్ ల లిస్ట్ కూడా తక్కువగా ఉండటం.. ఉన్న హీరోయిన్స్ లో కాజల్, తమన్నా, శ్రుతి హసన్ లాంటి వారు హిట్ ట్రాక్ తప్పడం.. ఒక్క రష్మిక మందన్నా తప్ప పూజాకి పోటీ ఇచ్చే వారే లేకపోవడం.. మొత్తానికి పూజా హెగ్డేకి తిరుగులేకుండా పోయింది.

    Also Read: అరె.. హీరోయిన్స్ కంటే యాంకర్లకే ఎక్కువ !

    ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకునే దర్శకనిర్మాతలంతా ఇప్పుడు పూజా వైపే చూస్తున్నారట. అందుకే కరోనా కాలంలో కూడా పూజా మాత్రం రెమ్యూనరేషన్ పెంచే ఆలోచనలో ఉందని.. ఒక్కో సినిమాకి సుమారు రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని.. దీనికి తోడు తన మేకప్ అండ్ తన సెటప్ ఖర్చులు కోసం అదనంగా రోజుకు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. వచ్చే నెల నుండి అక్షయ్ కుమార్ తో చేస్తోన్న హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుందట ఈ బ్యూటీ. ఆ సినిమాకి ఇలాగే పుచ్చుకుంటుందట. అందుకే టాలీవుడ్ సినిమాలకు కూడా ఇంతే ఇవ్వాలని మేనేజర్ చేత నిర్మాతలకు కబురు పెట్టింది. బాలీవుడ్ మార్కెట్ ఎక్కువ కాబట్టి.. రెమ్యునరేషన్ కూడా ఎక్కువే ఉంటుంది.

    Also Read: ముప్పై దాటాక గాని అర్ధం కాలేదు !

    అంతమాత్రాన అన్ని చోట్లా అంతే ఇవ్వాలంటే.. ఎలా అనేది మన నిర్మాతల అంతర్మథనం. పైకి ఇవ్వం అని చెప్పలేని పరిస్థితి. కొంతమంది హీరోలకు పూజా లాంటి స్టార్ హీరోయిన్ తమ సినిమాలో నటించడం కావాలి. మొత్తానికి తన డిమాండ్ ను అర్ధం చేసుకున్న పూజా.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను పక్కాగా ఫాలో అయిపోతోంది ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ చేస్తున్న ‘రాధే శ్యామ్’, అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు కూడా హిట్టైతే 2 కోట్లును కాస్త పూజా 3 కోట్లు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమైనా ఈ మధ్య పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది.