Indigo Crisis ఏ వ్యాపారమైన సరే సప్లై డిమాండ్ సూత్రం ఆధారంగానే నడుస్తుంది డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు ఆ కంపెనీ ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదుగుతుంది తన సేవలను మరింత విస్తృతం చేసుకుంటుంది వాస్తవానికి కంపెనీ బ్యాలెన్స్ షీట్ మొత్తాన్ని సప్లై డిమాండ్ సూత్రమే నిర్ధారిస్తుంది ఇలాంటి తరుణంలో సేవలను మరింత విస్తరించి ఉద్యోగులను మరింతగా పెంచి గొప్ప సంస్థగా ఎదిగాల్సిన సందర్భంలో యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ఇండిగో సంక్షోభం కళ్ళ ముందు కనిపించేలా చేస్తోంది ముఖ్యంగా ఇండిగో యాజమాన్యం వ్యవహరించిన తీరు భారతీయ ప్రయాణికులకు నరకం చూపిస్తోంది డొమెస్టిక్ సర్వీసులు మాత్రమే కాకుండా నాన్ డొమెస్టిక్ సర్వీసులలో కూడా ఇండిగో యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అంతర్జాతీయ ప్రయాణికులు కూడా నరకం చూస్తున్నారు.
ఇండిగో సంక్షోభం సివిల్ ఏవియేషన్ రంగానికి సరికొత్త పాఠాలు చెబుతోంది అంతేకాదు ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తేట తెల్లం చేస్తోంది ఇండిగోలో తలెత్తిన సంక్షోభాన్ని సరిగ్గా 30 సంవత్సరాల క్రితమే ఊహించారు చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఓ కామెడీ వీడియో ప్రస్తుత ఇండిగో సంక్షోభాన్ని కళ్ళ ముందు ఉంచుతోంది.
1995లో ఫుల్ టెన్షన్ టీవీ షోలో ఎస్ ఓ ఎస్ ఎయిర్ లైన్స్ ఎపిసోడ్ ప్రసారమైంది. ఆ ఎపిసోడ్లో విమానాశ్రయంలో సిబ్బంది కొరత ఉండటంతో ఒక వ్యక్తి లగేజీ నుంచి మొదలు పెడితే ఫ్లైట్ నడపడం వరకు అన్ని పనులు చేస్తాడు.. అప్పట్లో ఆ కామెడీ షో చాలామందిని నవ్వించింది. ఆ ఎపిసోడ్ అప్పట్లో చర్చకు కూడా దారితీసింది. ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ లో నెలకొన్న పరిస్థితికి నాటి ఎస్ ఓ ఎస్ ఎయిర్లైన్స్ ఎపిసోడ్ నిలువుటద్దం లాగా కనిపిస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
” సిబ్బంది కొరతతో ఒకే ఒక్క వ్యక్తి లగేజీ తీసుకురావడం, టికెట్లు ఇవ్వడం, పైలట్ అవతారం ఎత్తడం వరకు అన్ని చేయడం అప్పట్లో కామెడీగా అనిపించింది. కానీ ఇప్పుడు ఇండిగో సంక్షోభాన్ని చూస్తే భవిష్యత్తు కాలాన్ని ముందే ఊహించినట్టు అర్థమవుతోంది.. ఏది ఏమైనప్పటికీ విమానయాన రంగంలో ఇటువంటి దారుణం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
ఇండిగో సంక్షోభం వల్ల చాలామంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇండిగో సంస్థ ఇంతవరకు పూర్తిస్థాయిలో నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు.. దీనికి తోడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనకు వ్యతిరేకంగా ఇండిగో సంస్థ ఇలా నిరసన తెలిపిందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
SOS Airlines: Where One Hero Handles Reservations, Rage, and Rockets – IndiGo’s 2025 Nightmare, Bhatti-Style!
Shortage Of Sanity: Pilots Nap, Passengers Pray, and the CEO Dreams of Cloning Staff – Flop Show Prophesied It All! pic.twitter.com/43akPgkI1P
— Mohini Maheshwari (@MohiniWealth) December 7, 2025