Akhanda 2 release date: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన ‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రం ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వాయిదా పడడంతో నందమూరి అభిమానులు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారు. బాలయ్య కెరీర్ లోనే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న సినిమా, సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నా చాలు, ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుందని అంతా అనుకున్నారు. అంతటి ఆశలు పెట్టుకున్న ఈ సినిమా, అలా అర్థాంతరంగా ఆగిపోవడం, ఈ ఘటన జరిగి మూడు రోజులు దాటినా కూడా ఇప్పటికీ మరో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించకపోవడం పై అభిమానుల్లో ఉన్న అసహనం మరింత రెట్టింపు అయ్యింది. ప్రతీ రోజు సోషల్ మీడియా లో మేకర్స్ ని ట్యాగ్ చేసి తిడుతూనే ఉన్నారు. అయితే అందుతున్న లేటెస్ట్ సమాచారం బట్టీ చూస్తుంటే, ఈ చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ఈమేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి లోపు అధికారిక ప్రకటన చేయబోతున్నారట. అందుకే ఆస్ట్రేలియా లో కూడా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టేసారు. ఆస్ట్రేలియా లో ఆడియన్స్ సినిమాలను వీక్షించేందుకు ఎక్కువగా ఇష్టపడే HOTSY థియేటర్స్ చైన్ కి సంబంధించిన బుకింగ్స్ నేటి నుండి మొదలయ్యాయి. కానీ ఫ్యాన్స్ లో మాత్రం ఇంకా ఎలాంటి నమ్మకం కలగలేదు. ఎందుకంటే కొద్దిగంటల్లో సినిమా విడుదల అవుతుంది అని అభిమానులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధం అవుతున్న సమయంలో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. అలాంటిది ఎలాంటి అధికారిక ప్రకటన రాకుండా, కేవలం సమాచారాన్ని నమ్మి మరోసారి మోసపోవడానికి అభిమానులు సిద్ధం గా లేరు. కానీ ఆర్ధిక చిక్కుముడులను మాత్రం ఆ చిత్ర నిర్మాత ఒక్కొక్కొకటిగా విప్పుతూ వస్తున్నాడని టాక్. రాబోయే రెండు రోజుల్లో నందమూరి ఫ్యాన్స్ శుభవార్త ని వినబోతున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు థియేట్రికల్ ట్రైలర్స్ వచ్చాయి. రెండిటికి కూడా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందనే లభించింది. విడుదలైన పాటలకు కూడా మిశ్రమ స్పందనే. అందుకే ఈ చిత్రం కోసం నందమూరి ఫ్యాన్స్ తప్ప, ఎవ్వరూ ఎదురు చూడడం లేదు. ఇక సినిమా వాయిదా పడడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్స్ MG , SG డబ్బులను వెనక్కి ఇచ్చేయమని నిర్మాతని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని డబ్బులు కూడా కేవలం అడ్వాన్స్ తోనే ఆపేస్తామని, పూర్తి స్థాయి పేమెంట్స్ ఈసారి చేయబోమని నిర్మాతకు ముఖం మీదనే చెప్పేస్తున్నారు . ఇప్పుడు ఈ సమస్యని తీర్చడం కూడా నిర్మాతకు కత్తి మీద సాము లాంటిది. ఇన్ని చిక్కుముడులను దాటుకొని ఈ చిత్రం డిసెంబర్ 12 న వస్తుందో లేదో చూద్దాం.