https://oktelugu.com/

ప్రధానితో భేటికి కేసీఆర్, జగన్.. ఏం జరుగుతోంది?

ప్రధాని నరేంద్రమోడీ దేశంలో తీసుకోబోయే ఈ నిర్ణయానికైనా సరే తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్ సలహాలను ఖచ్చితంగా మోడీ తీసుకుంటున్నారు. అందుకే మోడీ నిర్వహించే ప్రతీ కీలక సమావేశంలోనూ కేసీఆర్ ను ఉండేలా జాగ్రత్త పడుతున్నారు మోడీ.. Also Read: ఏపీలో మత రాజకీయాలు దేనికి సంకేతం..? తాజాగా మోడీ మరో భేటికి నిర్ణయించారు.  దేశంలో అత్యంత తీవ్రంగా కరోనా ప్రబలుతున్న 10 రాష్ట్రాల సీఎంలతో […]

Written By:
  • NARESH
  • , Updated On : September 20, 2020 1:29 pm
    NARENDRAMODI

    NARENDRAMODI

    Follow us on

    NARENDRAMODI

    ప్రధాని నరేంద్రమోడీ దేశంలో తీసుకోబోయే ఈ నిర్ణయానికైనా సరే తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్ సలహాలను ఖచ్చితంగా మోడీ తీసుకుంటున్నారు. అందుకే మోడీ నిర్వహించే ప్రతీ కీలక సమావేశంలోనూ కేసీఆర్ ను ఉండేలా జాగ్రత్త పడుతున్నారు మోడీ..

    Also Read: ఏపీలో మత రాజకీయాలు దేనికి సంకేతం..?

    తాజాగా మోడీ మరో భేటికి నిర్ణయించారు.  దేశంలో అత్యంత తీవ్రంగా కరోనా ప్రబలుతున్న 10 రాష్ట్రాల సీఎంలతో భేటికి మోడీ నిర్ణయించారు. ఈ భేటి ఈనెల 23న ఉంటుందని సమాచారం. మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ స్థితిగతులపై ఆరా తీయనున్నారు.  కరోనా కట్టడిలో విఫలమవుతున్న సీఎంలతో మోడీ కాస్త గట్టిగానే హెచ్చరికలు చేస్తారని.. ఈసారి సాయంపై కూడా ప్రకటన చేస్తారని అంటున్నారు.

    ఈ క్రమంలోనే కరోనా నియంత్రణపై మోడీ సర్కార్ కీలక నిర్ణయాలతోపాటు సినిమా రంగం సహా పలు రంగాల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని సమాచారం. కేంద్రం అమలు చేస్తున్న కోవిడ్ మార్గదర్శకాల మార్పులు.. కరోనా రోగులకు చికిత్స, పౌష్టికాహారం, కోవిడ్ సెంటర్ల వైద్య సదుపాయాల గురించి మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.

    ఈ కీలక భేటికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లతోపాటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొంటారని సమాచారం.

    Also Read: రైతు బిల్లులకు వైసీపీ మద్దతు.. జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

    మొదట్లో లాక్ డౌన్ పెట్టిన మోడీ ఇప్పుడు అన్నింటిని వదిలేశాడు. దీంతో దేశంలో కరోనా  విశృంఖలంగా వ్యాపిస్తోంది. రోజుకు లక్ష చొప్పు కేసులు నమోదవుతున్నాయి. జనాలు కూడా కరోనాను లైట్ తీసుకున్నారు. దీంతో కేసుల సంఖ్య దేశంలో రోజుకు లక్షకు తగ్గడం లేదు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కరోనాతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలోనే మోడీ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.