ట్రబుల్ షూటర్ ఎంట్రీ.. ‘దుబ్బాక’ ఫలితం మారనుందా?

రాష్ట్రంలో త్వరలో జరిగే ఉప ఎన్నిక భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేయనుంది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతిలో రాష్ట్రంలో అనివార్యంగా ఉప ఎన్నిక వచ్చింది. గత ఆరేళ్ల టీఆర్ఎస్ పాలన.. కరోనా కట్టడిలో సర్కార్ విఫలం వంటి అంశాలు ఈ ఉప ఎన్నికపై ప్రభావం చూపనున్నారు. టీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కావడంతో ఆపార్టీ తన సీటును కాపాడుకోవాలని భావిస్తోంది. ప్రతిపక్షాలు సైతం టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుండటంతో దుబ్బాక ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది. Also Read: […]

Written By: NARESH, Updated On : September 20, 2020 1:34 pm

harish rao

Follow us on


రాష్ట్రంలో త్వరలో జరిగే ఉప ఎన్నిక భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేయనుంది. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతిలో రాష్ట్రంలో అనివార్యంగా ఉప ఎన్నిక వచ్చింది. గత ఆరేళ్ల టీఆర్ఎస్ పాలన.. కరోనా కట్టడిలో సర్కార్ విఫలం వంటి అంశాలు ఈ ఉప ఎన్నికపై ప్రభావం చూపనున్నారు. టీఆర్ఎస్ కు సిట్టింగ్ స్థానం కావడంతో ఆపార్టీ తన సీటును కాపాడుకోవాలని భావిస్తోంది. ప్రతిపక్షాలు సైతం టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు రెడీ అవుతుండటంతో దుబ్బాక ఉప ఎన్నిక రసవత్తరంగా మారనుంది.

Also Read: ప్రధానితో భేటికి కేసీఆర్, జగన్.. ఏం జరుగుతోంది?

తెలంగాణ ఉద్యమ సమయంలో.. ప్రత్యేక రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. అదే ఆనవాయితీని కొనసాగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఇటీవల రాష్ట్రంలో పరిస్థితులన్నీ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారుతోన్నాయి. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమవడం.. ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తుందనే అంశాలను ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. దీంతో టీఆర్ఎస్ సర్కారుపై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతోపాటు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలను ఆయన గాలికొదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు రామలింగారెడ్డి నాయకత్వాన్ని గతంలోనే వ్యతిరేకిస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశాయి. ఇక రాబోయే ఉపఎన్నికలో రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వద్దంటూ టీఆర్ఎస్ మండల నాయకులు తీర్మానాలు చేసి కేసీఆర్ కు పంపుతున్నారు. దీంతో సీఎం కేసీఆర్ రామలింగారెడ్డి కుమారుడు సతీష్ రెడ్డికి కాకుండా రామలింగారెడ్డి భార్య సుజాతకు టిక్కెట్టు ఇవ్వాలని భావిస్తున్నారట.

దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థులపై వ్యతిరేకత వస్తుండటంతో సీఎం కేసీఆర్ తన మేనల్లుడు హరీష్ రావును రంగంలోకి దింపుతున్నారు. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ఎలాంటి పరిస్థితులనైనా చక్కదిద్దుతారనే నమ్మకం కేసీఆర్ కు ఉంది. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల బాధ్యతను హరీష్ రావుకే అప్పగించినట్లు తెలుస్తోంది. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట పక్కనే దుబ్బాక నియోజకవర్గం ఉంది. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉండటంతో నాయకులందరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Also Read: ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ లో పోటాపోటీ..రేసులో వీరే?

ఇప్పటికే హరీష్ రావు దుబ్బాకలో పర్యటనలు చేస్తూ టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక సీటు ఆశిస్తున్న ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటిచ్చి టీఆర్ఎస్ అసంతృప్తి రాకుండా పావులు కదుపుతున్నారు. అసంతృప్త నేతలను పిలిచిపించుకొని హరీష్ రావు బుజ్జగిస్తున్నారు. మండలాలు, ప్రాంతాల వారీగా నాయకులు, కౌన్సిలర్లను ఇన్ ఛార్జులుగా నియమిస్తూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

రామలింగారెడ్డి భార్య సుజాతకే ఎమ్మెల్యే సీటు దక్కనుండటంతో అందరూ కలిసికట్టుగా ఆమె విజయానికి పని చేయాలని హరీష్ రావు శ్రేణులకు పిలుపునిస్తున్నారు. దుబ్బాకలో రామలింగారెడ్డి కుటుంబంపై వ్యతిరేకత అధికంగా ఉన్న పరిస్థితుల్లో హరీష్ రావు ఏమేరకు పరిస్థితులు చక్కబెడుతారనేది ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ ఇచ్చిన టాస్క్ లో హరీష్ రావు ఈసారి విజయం సాధిస్తారో లేదో వేచి చూడాల్సిందే..!