HomeజాతీయంChandrayaan-3 : చందమామపై భారత్ చెరగని ముద్ర.. గగనతలంలోకి చంద్రయాన్ 3

Chandrayaan-3 : చందమామపై భారత్ చెరగని ముద్ర.. గగనతలంలోకి చంద్రయాన్ 3

Chandrayaan-3  : చందమామపై భారత్ చెరగని ముద్ర వేయనుంది. అంతరిక్ష ప్రయోగంలో భారత్ మరో కలికితురాయిగా మిగలనుంది.  పూర్తి స్వదేశీ టెక్నాలజీతో చేపట్టిన చంద్రయాన్ 3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.  గగనతలంలోకి దూసుకెళ్లింది. దీంతో ఇస్రో వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ మాట్లాడుతూ రాకెట్ ప్రయోగం విజయవంతమైందని, త్వరలోనే చంద్రుడిని చేరుకుంటామని చెప్పారు. చంద్రయాన్ 2 ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నెల్లూరులోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్  నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు శాస్త్రవేత్తలు పంపించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండో ల్యాండ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం.3 బాహుబలి రాకెట్ నిప్పులుకక్కుతూ గగనతలంలోని దూసుకొని పోయింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలు జరగకుండా శాస్త్రవేత్తలు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు చంద్రయాన్ 3 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించారు.

మొత్తం 3,900 కిలోల పేలోడ్ తో రాకెట్ రోదసిలోకి  వెళ్లింది. రాకెట్ నుంచి విడిపోయాక వ్యోమనౌక భూమికక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్, అక్కడ నుంచి చంద్రునిపై దిగిన తరువాత ప్రయోగాలు చేసే విక్రమ్ ల్యాండర్, ఉపరితంపై తిరుగుతూ పరిశోధనలు చేసే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్ 3లో అమర్చి ఉన్నాయి. చంద్రయాన్ 3కి మొత్తం 619 కోట్లు ఖర్చుచేశారు. ఆగస్టు 23వ తేదీ లేదా 24 తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవంలో ల్యాండింగ్‌ అవుతుంది. ఇది చంద్రుడి ఉపరితలంపై అధ్యయనం చేయనుంది. కాగా రాకెట్ ప్రయోగం సక్సెస్ కావడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ రోజుగా అభివర్ణించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper