దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే.. ఇప్పుడు కొత్త రకం వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీంతో కేంద్రం ఒక్కసారిగా అలర్ట్ అయింది. అయితే.. వచ్చేనెలలో రాబోతున్న రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. వీక్షకుల సంఖ్య తగ్గించడం.. మాస్క్‌లు, ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరి చేయడంతోపాటు చరిత్రలో తొలిసారి ఎర్రకోటకు దూరంగా వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం.
Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. విమానాన్ని తలపించేలా రైలు బోగీలు..?
గణతంత్ర వేడుకలు ఏటా ఎర్రకోటలో జరుపుకుంటారు. అయితే.. ఈసారి కరోనా దృష్ట్యా పరేడ్‌ను విజయ్ చౌక్ నుంచి నేషనల్ స్టేడియం వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పరేడ్ దూరాన్ని 8.2 కిలోమీటర్ల నుంచి 3.3 కిలోమీటర్లకు తగ్గించనున్నారట. అంతకుముందు ఒక్కో బృందానికి 144 మంది సభ్యులుండగా.. ఈసారి 96కు కుదించారు. విన్యాసాల్లో పాల్గొనే వారు కూడా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: రజనీ ‘నో పొలిటిక్స్’కి భారతీరాజా మద్దతు..!
అంతకుముందు లక్ష మందికి పైగా ప్రేక్షకులు వేడుకలను తిలకించేవారు. ఈసారి 25 వేలకే పరిమితం చేస్తారని తెలుస్తోంది. 15 ఏళ్లలోపు చిన్నారులకు ఎంట్రీ లేదని.. కల్చరల్ ప్రోగ్రామ్స్‌ను కూడా కుదించినట్లు సమాచారం. దీనికి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కాగా.. ఈసారి గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ముఖ్యఅతిథిగా హాజరుకాబోతున్నట్లు ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది. తాజాగా.. యూకేలో కరోనా కొత్త రకం విజృంభిస్తుండడంతోపాటు భారత్‌లోనూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా బోరిన్ జాన్సన్ పర్యటనపై సందిగ్ధం నెలకొంది.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం