https://oktelugu.com/

‘సాగర్లో’ టీఆర్ఎస్ వడపోత షూరు..!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నాగార్జున్ సాగర్లో గెలిచి తీరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపింది. దీనికితోడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది. ఇదేక్రమంలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగడం ఆ పార్టీకి కంటగింపుగా మారింది. నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక ప్రభావం రాబోయే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 30, 2020 / 04:02 PM IST
    Follow us on

    టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య అకాల మరణంతో నాగార్జున్ సాగర్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నాగార్జున్ సాగర్లో గెలిచి తీరాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

    దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపింది. దీనికితోడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది. ఇదేక్రమంలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగడం ఆ పార్టీకి కంటగింపుగా మారింది.

    నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ ఓటమిపాలైతే మాత్రం ఆపార్టీకి కోలుకోలేని దెబ్బపడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ సాగర్లో బలమైన అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించారు. గెలుపు గుర్రానికి టిక్కెట్ కేటాయించనున్నట్లు ఇప్పటికే సంకేతాలను పంపించారు. నోముల కుటుంబానికి నామినేషన్ పదవీ ఆఫర్ చేసినట్లు టీఆర్ఎస్ లో ప్రచారం జరుగుతోంది.

    అయితే సాగర్లో పోటీకి నోముల నర్సింహాయ్య భార్య లక్ష్మి.. కొడుకు భగత్ ఆసక్తి చూపుతున్నారు. యాదవ సంఘం నేతలు కూడా నోముల కుటుంబానికే టికెట్ కేటాయించాలని తీర్మానాలు చేస్తున్నారు.

    నియోజకవర్గంలో యాదవులు 40వేలకు పైగా ఉండటంతో సానుభూతి కలిసొస్తుందని చెబుతున్నారు. దీనిపై కూడా టీఆర్ఎస్ లో జోరుగా చర్చ జరుగుతోంది. నోముల కుటుంబం సైతం పార్టీ తమకే టికెట్ కేటాయిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    మరోవైపు శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి.. టీఆర్ఎస్ నేత కోటిరెడ్డి పేర్లు తెరపైకి వస్తున్నాయి. గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీకి నై అంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర పార్టీల నేతలకు సైతం టీఆర్ఎస్ గాలం వేస్తోంది.

    నాగార్జున్ సాగర్ అభ్యర్థి పై టీఆర్ఎస్ లో ఇప్పటికే వడపోత షూరు అయినట్లు కన్పిస్తోంది. ఈనేపథ్యంలో నాగార్జున్ సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది. దీనిపై త్వరలోనే మరింత క్లారిటీ రావడం ఖాయంగా కన్పిస్తోంది.