spot_img
Homeజాతీయంఈ కార్డు ఉన్నవాళ్లకు శుభవార్త.. 50 శాతానికి పైగా డిస్కౌంట్..?

ఈ కార్డు ఉన్నవాళ్లకు శుభవార్త.. 50 శాతానికి పైగా డిస్కౌంట్..?


కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశీయ కార్డ్ అయిన రూపే కార్డును ప్రమోట్ చేస్తోంది. రూపే కార్డు ద్వారా కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు రూపే కార్డులను ఖాతాదారులకు ఎక్కువగా మంజూరు చేయాలని సూచనలు చేసిన సంగతి తెలిసిందే. రూపే కార్డులను ప్రమోట్ చేయాలని మంత్రి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశారు.

భారతదేశానికి ఎన్‌పీసీఐని బ్రాండ్ గా తీర్చిదిద్దాలని ఖాతాదారులకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులను జారీ చేయాల్సి వస్తే రూపే కార్డులను జారీ చేయాలని నిర్మలా సీతారామన్ కోరారు. భారత్ లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపే కార్డ్ యొక్క నెట్వర్క్ బాధ్యతలను చూసుకుంటోంది. రూపే కార్డ్ మన దేశం యొక్క సొంత కార్డ్ పేమెంట్ నెట్వర్క్ కావడంతో ఈ కార్డులను ప్రమోట్ చేస్తోంది.

ఇప్పటికే రూపే కార్డును వాడుతున్న కస్టమర్లు రూపే వెబ్ సైట్ కు వెళ్లి అందుబాటులో ఉన్న ఆఫర్లకు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్‌పీసీఐ ప్రస్తుతం రూపే ఫెస్టివల్ కార్నివాల్ పేరుతో రూపే కార్డ్ యూజర్లకు భారీగా ఆఫర్లను ప్రకటించింది. రూపే కార్డ్ ఉన్న ఖాతాదారులు అమెజాన్ పే, స్విగ్గీ, హెరిటేజ్ ఫ్రెష్ లలో కొనుగోళ్లు చేసి 10 నుంచి 50 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు.

మింత్రా, టాటా క్లిక్, జోయలుక్కాస్, బాటా, బిగ్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, జీ5 సబ్ స్క్రిప్షన్ పై కూడా రూపే కార్డ్ ఉన్నవాళ్లు తగ్గింపు ఆఫర్లను పొందే అవకాశం ఉంది. రూపే కార్డ్ తో శాంసంగ్ ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్ లభిస్తుంది. కేంద్రం రూపే కార్డ్ యూజర్ల సంఖ్య పెంచడం కోసం రూపే కార్డు కొనుగోళ్లపై భారీగా ప్రయోజనాలను అందిస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ కి ఇవే మైనస్ అయ్యాయి…

Chennai Love Story: కిరణ్ అబ్బవరం చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే ఉంటుంది. నటనపరంగా ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి సినిమా కంటెంట్ లో చాలా...
Spain Royal Family

Spain Royal Family: స్పెయిన్‌ రాజవంశంలో కొత్త యుగం… 20 ఏళ్లకే సింహాసనం ఎక్కిన రాణి!

Spain Royal Family: స్పెయిన్‌ యూరప్‌లో చిన్న దేశం. ఇటీవల ఇరాన్‌ యుద్ధ సమయంలో అగ్రరాజ్యం అమెరికా తీరును తప్పు పట్టింది. సైనిక స్థావరం ఏర్పాటుకు కూడా అనుమతి ఇవ్వలేదు. వందల ఏళ్ల...
Chennai Love Story First Day Collections

Chennai Love Story First Day Collections: ‘చెన్నై లవ్ స్టోరీ’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. కిరణ్...

Chennai Love Story First Day Collections: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , కాస్త...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: మోడీ నో అన్నా.. ఎట్టకేలకు ‘ధర్మేంధ్ర ప్రధాన్‌’ రాజీనామా.. తెరవెనుక ఏం జరిగిందంటే?

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలించాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీకి...
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఇండియన్ కాదా..? పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Akhil Akkineni: అక్కినేని అఖిల్ రీసెంట్ గానే 'లెనిన్' చిత్రం తో తన కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది , ఇప్పటికీ...
Oktelugu Epaper