Ustaad Bhagat Singh movie criticism: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తీర్చి దిద్దడం లో కొంతమంది దర్శకులకు చాలా మంచి గ్రిప్ ఉంది. అలాంటి వారి నుంచి ఎలాంటి సినిమా వచ్చిన కూడా అది మినిమం గ్యారంటిగా ఆడుతుంది తప్ప ఫ్లాప్ అయితే అవ్వదు. అలాంటి వాళ్ళలో హరీష్ శంకర్ ఒకరు… మిరపకాయ్, గబ్బర్ సింగ్ సినిమాలతో తన స్టామినా ఏంటో సినిమా ఇండస్ట్రీకి చూపించాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు సక్సెస్ అయినప్పటికి భారీ విజయాలను సాధించకపోవడంతో ఆయన స్టార్ డైరెక్టర్ గా మారలేకపోయాడు… ఏది ఏమైనా కూడా హరీష్ శంకర్ మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలి అనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో పలు సినిమాలు చేయాలని అనుకున్నప్పటికి అది వర్కౌట్ కాలేదు.
దాంతో ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరోసారి అవకాశం దొరికింది. ఈ సినిమా ఈ సంవత్సరం మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది… గత సంవత్సరం పవన్ కళ్యాణ్ చేసిన ఓజీ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సంవత్సరం ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: గూస్ బంప్స్ రప్పిస్తున్న ‘వారణాసి’ మేకింగ్ వీడియో..నాగార్జున ఎంట్రీ ట్విస్ట్ అదుర్స్!
ఈ సినిమా మీద గత మూడు నాలుగు రోజుల నుంచి విపరీతమైన నెగెటివిటీ వస్తుంది కారణమేంటి అంటే పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానాన్ని సినిమాలో చూపించాలనే ఉద్దేశ్యంతో హరీష్ శంకర్ ఒక సాంగ్ నైతే కంపోజ్ చేయించాడు. ‘నేను మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే’ అంటూ వచ్చే ఈ లిరిక్స్ పవన్ కళ్యాణ్ కి భజన చేసినట్టుగా ఉంది తప్ప సినిమా కాన్సెప్ట్ చెప్పే విధంగా లేదంటూ చాలా మంది పవన్ కళ్యాణ్ ఆంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
దాంతో సినిమా మీద ఆటోమేటిగ్గా నెగెటివిటి పెరిగిపోతుంది. ఇక తొందరలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మూవీ మీద నెగెటివిటి రావడంతో సినిమా మేకర్స్ సైతం ఈ విషయం మీద చాలా వరకు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకరకంగా హరీష్ శంకర్ చేసిన పని వల్లే ఈ సినిమా మీద నెగెటివిటి స్ప్రెడ్ అవుతుంది అంటు మరి కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం భావిస్తున్నారు. ఇక ఇది ఎక్కడ వరకు వెళ్తుంది సినిమా రిలీజ్ కి 4 రోజుల ముందు భారీ బజ్ క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…