Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh Karnataka theatrical rights: KGF మేకర్స్ చేతుల్లోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'.....

Ustaad Bhagat Singh Karnataka theatrical rights: KGF మేకర్స్ చేతుల్లోకి ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ ఫ్యాన్స్ కి పండగే ఇక!

Ustaad Bhagat Singh Karnataka theatrical rights: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం మరో నెలరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ , బిజినెస్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి మొదటి నుండి డీసెంట్ హైప్ ఉంది. ముఖ్యంగా మొదటి పాటకు వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్ అనే హిప్పాలి . దాదాపుగా 50 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ పాట. కానీ ఎసెంట్ గా విడుదలైన పాట మాత్రం అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. దేవి శ్రీ ప్రసాద్ రేంజ్ పాట కాదని , లిరిక్స్ అసలు బాగాలేవని , ఇలా ఎన్నో రకాల కామెంట్స్ వినిపించాయి . ఈ పాట కారణంగా సినిమా మీదున్న బజ్ తగ్గిపోతుందేమో అని అంతా అనుకున్నారు.

కానీ ఇసుమంత కూడా తగ్గలేదని రీసెంట్ గానే తెలిసింది. వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా కర్ణాటక ప్రాంతం థియేట్రికల్ రైట్స్ ని హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకుందని అంటున్నారు. గతం లో వీళ్ళు KGF సిరీస్, సలార్ వంటి చిత్రాలను నిర్మించి ఇండియా లోనే టాప్ మోస్ట్ నిర్మాతలలో ఒకరిగా నిలిచారు. అలాంటి సంస్థ ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుంది. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చినట్టే . ఎందుకంటే ఈ సినిమా కంటే వారం రోజుల ముందు KGF హీరో యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్ ‘ విడుదల కాబోతుంది. ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు . ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా కర్ణాటక లో విడుదల అవుతుంటే , వేరే సినిమాలకు థియేటర్స్ దక్కడం అసాధ్యం .

Also Read: విజయ్ దేవరకొండ ను లవ్ చేసిన ముగ్గురు హీరోయిన్స్ వీళ్ళేనా..?

అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మాతలు హోమబుల్ ఫిలిమ్స్ సంస్థ ని ఏర్పాటు చేసుకున్నారు . దాదాపుగా 8 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కర్ణాటక ప్రాంతానికి గానూ అమ్ముడుపోయింది అట . ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన నెట్ ఫ్లిక్స్ డీల్ కూడా రీసెంట్ గానే ముగిసినట్టు తెలుస్తోంది. దాదాపుగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది . అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ + నైజాం ప్రాంతాలకు కలిపి 120 కోట్లు , ఇలా ఓవరాల్ బిజినెస్ పరంగా పీక్ రేంజ్ ని చూపిస్తూ ముందుకెళ్తోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పాటలు లేని ఓజీ లాంటి సినిమానే తెలుగు రాష్ట్రాల నుండి 200 కోట్ల గ్రాస్ ని రాబట్టింది . అలాంటి ఫక్తు కమర్షియల్ మూవీ అయినటువంటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular