https://oktelugu.com/

ఫేస్ బుక్ యూజర్లకు అలర్ట్.. లైక్ బటన్ కనిపించదట..!

  దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఫేస్ బుక్ యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమైంది. ఫేస్ బుక్ పేజ్ లే అవుట్ కు సంబంధించి కీలక మార్పులు జరిగాయి. పబ్లిక్ పేజీల విషయంలో లైక్ బటన్ ను తొలగించడానికి ఫేస్ బుక్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. అదే సమయంలో ఫేస్ బుక్ కొన్ని కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేయనుందని తెలుస్తోంది. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 20, 2021 12:33 pm
    Follow us on

     

    Facebook
    దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా దిగ్గజంగా పేరు తెచ్చుకున్న ఫేస్ బుక్ యూజర్లకు సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమైంది. ఫేస్ బుక్ పేజ్ లే అవుట్ కు సంబంధించి కీలక మార్పులు జరిగాయి. పబ్లిక్ పేజీల విషయంలో లైక్ బటన్ ను తొలగించడానికి ఫేస్ బుక్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. అదే సమయంలో ఫేస్ బుక్ కొన్ని కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేయనుందని తెలుస్తోంది.

    Also Read: వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..?

    లైక్ బటన్ ను తొలగించినప్పటికి అదే సమయంలో కొన్ని కొత్త ఫీచర్లను ఫేస్ బుక్ అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. ఆర్టిస్టులు, వివిధ బ్రాండ్లు, పబ్లిక్ లో పాపులారిటీ ఉన్నవాళ్లు పబ్లిక్ పేజీలను ఎక్కువగా వినియోగిస్తారనే సంగతి తెలిసిందే. యూజర్లకు ఇష్టమైన పేజీకి సంబంధించిన అప్ డేట్లను పొందాలని భావిస్తే ఫాలో బటన్ ను ఎంచుకోవడం ద్వారా అప్ డేట్లను పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: అసీస్ కు గర్వభంగం.. భారత్ చేసిన అద్భుతం

    గతంలో ఫేస్ బుక్ పేజీకి ఉండే లైకులను బట్టి ఆ పేజీ పాపులర్ పేజీనో కాదో గుర్తించే అవకాశం ఉండేది. ఇకపై లైక్ లకు బదులుగా ఫాలో అనే బటన్ ను యూజ్ చేసి పబ్లిక్ పేజీలకు సంబంధించిన అప్ డేట్లను పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఫేస్ బుక్ పబ్లిక్ పేజీలకు లైక్, ఫాలో రెండు బటన్లు ఉండేవి. అయితే రెండు ఆప్షన్ లు ఉండటం యూజర్లను గందరగోళానికి నెడుతుండటంతో ఫేస్ బుక్ ఈ నిర్ణయం తీసుకుంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఫేస్ బుక్ తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఇకపై రెండు ఆప్షన్లకు బదులుగా ఒక ఆప్షన్ మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉండనుంది. అయితే ఫేస్ బుక్ లైక్ బటన్ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం గురించి యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.