https://oktelugu.com/

బీఎస్ఎన్‌ఎల్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏమిటంటే..?

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కు సంబంధించిన ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త ప్లాన్లను తీసుకున్న యూజర్లకు చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కొత్త ప్లాన్ల ద్వారా ఎక్కువ డేటాను పొందడంతో పాటు యూజర్లకు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్ల ద్వారా 200 ఎమ్‌బిపిఎస్ వేగంతో 4 టీబీ డేటా పొందే అవకాశం ఉంటుంది. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 20, 2021 12:42 pm
    Follow us on

    BSNL

    భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కు సంబంధించిన ప్లాన్లలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త ప్లాన్లను తీసుకున్న యూజర్లకు చాలా ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కొత్త ప్లాన్ల ద్వారా ఎక్కువ డేటాను పొందడంతో పాటు యూజర్లకు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్ల ద్వారా 200 ఎమ్‌బిపిఎస్ వేగంతో 4 టీబీ డేటా పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..?

    పాన్ ఇండియా ప్రాతిపదికన బీఎస్ఎన్‌ఎల్ ఈ ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త భారత్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ద్వారా ఇతర ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. బీఎస్ఎన్‌ఎల్ వెబ్ సైట్ ద్వారా కొత్త ప్లాన్లకు సంబంధించిన పూర్తి వివరాలను యూజర్లు తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో బీఎస్ఎన్‌ఎల్ 499 ప్లాన్ ను తీసుకున్న యూజర్లకు 20 ఎమ్‌బిపిఎస్ వేగంతో 100 జీబీ డేటా లభించేది.

    Also Read: షావోమీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిపబ్లిక్ డే భారీ డిస్కౌంట్ ఆఫర్లు..?

    779 ప్లాన్ ద్వారా యూజర్లు 300 జీబీ డేటాను పొందడంతో పాటు 100 ఎమ్‌బిపిఎస్ స్పీడ్ తో ఇంటర్నెట్ లభిస్తుంది. అయితే హై స్పీడ్ డేటా ఉన్నంత వరకు మాత్రమే ఈ వేగంతో ఇంటర్నెట్ పొందే అవకాశం ఉంటుంది. హై స్పీడ్ డేటా పూర్తైన తరువాత గతంలో 2 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వచ్చేది. ప్రస్తుతం 2 ఎంబీపీఎస్ కు బదులుగా 5 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వస్తుంది.

    మరిన్ని వార్తల కోసం: వ్యాపారము

    ఈ ప్లాన్ ద్వారా డిస్నీ + హాట్ స్టార్ ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. 849 రూపాయల బ్రాడ్ ‌బ్యాండ్ ప్లాన్ ద్వారా ప్రస్తుతం 100 ఎంబీపీఎస్ వేగంతో డేటాను పొందే అవకాశం ఉంటుంది. 949 రూపాయలు, 1,999 రూపాయలకు సంబంధించిన బ్రాడ్ ‌బ్యాండ్ ప్లాన్లలో కూడా బీఎస్ఎన్‌ఎల్ కీలక మార్పులు చేసింది.