https://oktelugu.com/

ఈ కొత్త వైరస్‌ ఎలా వచ్చిందో తెలుసా..?

కంటికి కనిపించని వైరస్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆ వైరస్‌లోనూ గ్రూపులు వెలుగులోకి రావడంతో వైరస్‌ తయారుచేయడంలో సైంటిస్టులు కూడా ఆగమాగం అవుతున్నారు. ఇప్పటివరకు కోవిడ్‌ 19లో పదకొండు ఉప గ్రూపులు ఉన్నా.. అవేవీ అంత డేంజన్‌ కాలేదు. కానీ.. తాజాగా గుర్తించిన ‘ఏ2బీ’ వర్గానికి చెందినది మహా ప్రమాదకరమని గుర్తించారు. ఇదేమీ ప్రాణాలు తీయదు కానీ.. ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా విస్తరిస్తుందట. కోవిడ్ 19తో పోలిస్తే (మరింత వివరంగా చెప్పాలంటే ‘‘ఏ2ఏ’’ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 23, 2020 / 12:07 PM IST
    Follow us on


    కంటికి కనిపించని వైరస్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఆ వైరస్‌లోనూ గ్రూపులు వెలుగులోకి రావడంతో వైరస్‌ తయారుచేయడంలో సైంటిస్టులు కూడా ఆగమాగం అవుతున్నారు. ఇప్పటివరకు కోవిడ్‌ 19లో పదకొండు ఉప గ్రూపులు ఉన్నా.. అవేవీ అంత డేంజన్‌ కాలేదు. కానీ.. తాజాగా గుర్తించిన ‘ఏ2బీ’ వర్గానికి చెందినది మహా ప్రమాదకరమని గుర్తించారు. ఇదేమీ ప్రాణాలు తీయదు కానీ.. ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా విస్తరిస్తుందట. కోవిడ్ 19తో పోలిస్తే (మరింత వివరంగా చెప్పాలంటే ‘‘ఏ2ఏ’’ వర్గం వైరస్) 70 శాతం వేగంగా విస్తరించే పాడు గుణమే ప్రపంచానికి నిద్ర లేకుండా చేస్తోంది.

    Also Read: అప్పుడు వూహాన్‌.. ఇప్పుడు బ్రిటన్‌..: ప్రపంచ దేశాల్లో వైరస్‌ భయం

    ఎలాగూ వ్యాక్సిన్ వచ్చేసింది.. మరో ఆర్నెల్లలో కోవిడ్ 19ను చాప చుట్టేయొచ్చన్న భావన ప్రపంచ దేశాల్లో వచ్చింది. కానీ.. దానిని తుంగలో తొక్కి.. మళ్లీ లాక్ డౌన్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తోందనేదే భయపెడుతోంది. ఇంతకీ ఈ ‘ఏ2బీ’ ఎలా మార్పు చెందింది? దాని వెనుకున్న కారణం ఏమిటి? అన్న విషయంపై శాస్త్రవేత్తలు ఆసక్తికర అంశాల్ని వెల్లడిస్తున్నారు. కోవిడ్ 19 వైరస్ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రోగ నిరోధక శక్తి ఉన్న అతి కొద్ది మంది కరోనా రోగుల్లో కొన్ని నెలలపాటు వైరస్ ఉంటుంది. అలా ఉన్న వైరస్ కుదురుగా ఉండకుండా.. శరీరం లోపల అనేక మార్పులకు గురవుతుంటుంది.

    అలా అలా మార్పులు చేసుకుంటూనే మార్పులకు గురై.. అది కాస్త బయటకు వచ్చి.. వేరే వారిలో చేరుతుంటుంది. అలా చేరే వైరస్.. మరిన్ని మార్పులకు గురవుతుంటుంది. ఇదో విధానమైతే.. రెండో విధానం జంతువుల్లోకి వైరస్ వెళ్లి మార్పులు చెంది.. ఆ మారిన వైరస్ తిరిగి మనుషుల్లోకి చేరటం. ఈ పద్ధతిలోనూ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. డెన్మార్క్ లో మింక్ అనే క్షీరదం కరోనా బారిన పడటంతో.. లక్షలాది మింక్ జంతువులను చంపేసి పాతిపెట్టాలని నిర్ణయించటం తెలిసిందే.

    Also Read: వచ్చే వారమే భారత్ లో కరోనా వ్యాక్సిన్?

    అలా ఈ వైరస్‌ జంతువుల్లోకి కూడా చేరుతోంది. అలా చేరి కూడా మార్పులను కోరుకుంటోంది. తిరిగి అది మళ్లీ మనిషి శరీరంలోకే ఎక్కుతోంది. ఆ మార్పులే ఇప్పుడు ప్రపంచాన్ని మరింతగా వణికిస్తున్నాయి. ఈ వైరస్‌కు ఆదిలోనే అడ్డుకోగలరా.. లేక మరోసారి పరిస్థితులు లాక్‌డౌన్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయా..? అర్థం కాకుండా ఉంది. మొత్తంగా అసలే చలికాలం కావడం.. మరోసారి వైరస్‌ రూపాంతరం చెందడంతో అందరిలోనూ భయాందోళనలు మాత్రం కనిపిస్తున్నాయి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్