https://oktelugu.com/

జబర్ధస్త్ లవ్.. వర్ష ప్రేమ ఫలిస్తుందా?

జబర్ధస్త్ వేదికపై ప్రేమ కథలు కొత్తేమి కాదు. యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. చాలా ఏళ్లుగా వీళ్ళ ప్రేమాయణం సాగుతుంది. బుల్లితెరపై ఓపెన్ గా ప్రేమించుకునే ఈ ప్రేమ జంట, అసలు కథ ఏమిటనేది ఎవరికీ తెలియదు. క్రేజ్ కోసం, కెరీర్ కోసం వీరు ప్రేమ నటిస్తున్నారా, లేక మనస్సులో కూడా ఒకరంటే ఒకరికి ఇష్టమా అనే సందిగ్ధత కొనసాగుతుంది. బుల్లితెరపై సూపర్ హిట్ పెయిర్ గా ఉన్న వీరు అనేక […]

Written By:
  • admin
  • , Updated On : December 23, 2020 / 11:52 AM IST
    Follow us on


    జబర్ధస్త్ వేదికపై ప్రేమ కథలు కొత్తేమి కాదు. యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. చాలా ఏళ్లుగా వీళ్ళ ప్రేమాయణం సాగుతుంది. బుల్లితెరపై ఓపెన్ గా ప్రేమించుకునే ఈ ప్రేమ జంట, అసలు కథ ఏమిటనేది ఎవరికీ తెలియదు. క్రేజ్ కోసం, కెరీర్ కోసం వీరు ప్రేమ నటిస్తున్నారా, లేక మనస్సులో కూడా ఒకరంటే ఒకరికి ఇష్టమా అనే సందిగ్ధత కొనసాగుతుంది. బుల్లితెరపై సూపర్ హిట్ పెయిర్ గా ఉన్న వీరు అనేక కార్యక్రమాలలో కలిసి సందడి చేశారు. రొమాంటి సాంగ్స్ తో రెచ్చిపోయి నటించే వీరిద్దరూ, కొన్ని కార్యక్రమాలలో పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా జబర్ధస్త్ వేదికగా మరో ప్రేమ కథ చిగురించింది.

    Also Read: ఓ ఇంటివాడు కాబోతున్న అవినాష్… అమ్మాయి ఎవరంటే?

    ఈ మధ్యనే టీవీ నటి వర్ష జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వర్ష గ్లామర్ చూసిన ప్రేక్షకులు ఆమెకు బాగా కనెక్ట్ అయ్యారు. జబర్ధస్త్ వేదికపై రష్మీ, అనసూయ అందాలతో విసిగిపోయిన వారికి వర్ష రూపంలో మరో గ్లామర్ డాల్ దొరికింది. లంగా ఓణీ, శారీలలో వర్ష గ్లామర్ షో, ప్రేక్షకులను కట్టిపడేసింది. దీనితో ఎవరు ఈ కొత్తపిల్ల అని విచారించడం మొదలుపెట్టారు. అనేక టీవీ సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు, వర్షకు జబర్ధస్త్ ద్వారా వచ్చింది. వస్తూ వస్తూనే వర్ష ఓ ప్రేమ కథ మొదలుపెట్టారు. ప్రస్తుతం వర్ష, ఇమ్మాన్యుయేల్ లవ్ స్టోరీ హాట్ టాప్ గా మారింది. వర్షతో కలిసి ఇమ్మాన్యుయేల్ జబర్థస్త్ లో నవ్వులు పూయిస్తున్నాడు. నల్లగా ఉండే ఇమ్మాన్యుయేల్ వెంటపడే అమ్మాయిగా వర్షను చూపిస్తూ స్కిట్స్ చేస్తున్నారు.

    వర్ష, ఇమ్మాన్యుయేల్ స్కిట్స్ జబర్ధస్త్ లో సక్సెస్ కావంతో పాటు మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారట. వర్ష నల్లగా ఉన్నప్పటికీ జబర్ధస్త్ ఇమ్మాన్యుయేల్ ని ఇష్టపడుతున్నారట. ఇమ్మాన్యుయేల్ మాయలో పడిపోయిన వర్ష అతని ప్రేమ కోసం పరితపిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య సాయి కుమార్ హోస్ట్ గా సాగిన ఓ షో వేదికగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటపడింది. వినడానికే విడ్డూరంగా ఉన్నా… ఇమ్మాన్యుయేల్ లో వర్ష మహేష్ బాబును చూసుకుంటుందట.

    Also Read: ఓ ఇంటివాడైన చాహల్‌

    జబర్ధస్త్ వేదికపై ప్రేమించుకుని… తమ మధ్య ఎఫైర్ ఉందని అనిపించేలా ప్రవర్తిస్తూ రష్మీ, సుదీర్ కెరీర్ లో స్థిరపడ్డారు. ఈ విషయాన్ని సుదీర్ స్వయంగా ఒప్పుకున్నారు. బుల్లితెరపై రష్మితో తాను చేసిన రొమాన్స్ తనకు కెరీర్ ఇచ్చిందని ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వర్ష, ఇమ్మాన్యుయేల్ కూడా ఈ ఫార్మలా వాడుతున్నారా అనే సందేహం ఉంది. వాళ్లకు మాదిరి క్రేజీ లవ్ బర్డ్స్ అనే బ్రాండ్ వేసుకొని, కెరీర్ నిర్మించుకునే ఆలోచన కూడా కావచ్చు. నిజం ఏదైనా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరో ప్రేమ జంట తయారైంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్