Tollywood Directors: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే మేకర్స్ సైతం డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను ట్రై చేస్తూ ప్రేక్షకుడికి జెన్యూన్ కంటెంట్ ని అందించే ప్రయత్నం చేస్తున్నారు…ఇక అందులో భాగంగానే స్టార్ హీరోలు భారీ ఎలివేషన్స్ తో సినిమాలను చేస్తూ ప్రేక్షకులు యొక్క అటెన్షన్ ను తమ వైపు తిప్పుకుంటున్నారు… అంత ఒకే కానీ సినిమా షూటింగ్ లో పాల్గొనేటప్పుడు దాదాపు 12 గంటలు లేదంటే 15 గంటలు పనిచేయాల్సి వస్తుంది మాకు కుటుంబాలు ఉన్నాయి కదా కేవలం 8 గంటలు వర్క్ చేస్తే సరిపోతుంది కదా అంటున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపిక పదుకొనే సినిమా షూటింగ్లో పాల్గొనడానికి 6 అవర్స్ మాత్రమే కేటాయిస్తానని చెప్పింది. ఆమె పెట్టిన కండిషన్స్ వల్లే ఆమెను స్పిరిట్, కల్కి 2 సినిమాల నుంచి తప్పించారు…ఈ విషయం మీద చాలా రోజులుగా చాలా చర్చలైతే జరుగుతున్నాయి.
వర్కింగ్ అవర్స్ 8 గంటలే ఉండాలి అని కొంతమంది చెబుతుంటే మరి కొంతమంది మాత్రం అదేమీ గవర్నమెంట్ జాబ్ కాదు ఎనిమిది గంటలు వర్క్ చేసి మిగతా సమయం రెస్ట్ తీసుకోవడానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి క్రియేటివ్ ఫీల్డ్ లో టైమ్ తో సంభదోళం ఉండదు. మనం చేసే పనిని ఎంజాయ్ చేస్తూ చేయాలి. అప్పుడే మన పాషన్ కి అర్థం ఉంటుంది. మనం అనుకున్న విజయం దక్కుతోంది.
మహా అయితే నెలకి 20 రోజులు షూటింగ్ ఉండొచ్చు… మిగిలిన 10 రోజులు ఖాళీగానే ఉంటారు కదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ విషయం మీద డైరెక్టర్ చందు మొండేటి సైతం స్పందిస్తూ 8 గంటలు వర్కింగ్ అవర్స్ అనేది కరెక్ట్ కాదు. సమయాన్ని దాటి అదనపు వర్క్ ఉండడం వల్ల నటీనటులు, దర్శకుడు ఇతర టెక్నీషియన్స్ ని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరికీ ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల అదనపు వేతనాలు అందుతున్నాయి. అది మంచి విషయమే కదా అంటూ ఆయన మాట్లాడాడు…
ఇక అనిల్ రావిపూడి సైతం సినిమాకి పనిచేస్తున్న వారందరూ కలిసి కొంచెం అదనపు వర్క్ చేయడం వల్ల ప్రొడ్యూసర్స్ కి అనుకున్న సమయంలో సినిమా అయిపోతోంది. తద్వారా బడ్జెట్ ని కూడా కొంత వరకు కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము అంటూ ఆయన సమాధానమైతే ఇచ్చాడు. ఈ విషయం మీద చాలా మంది భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే బయట చేసే జాబ్ లాంటిదైతే కాదు. అది క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి అవర్స్ తో పని పెట్టుకోకుండా వర్క్ చేసినప్పుడే సినిమా సక్సెస్ సాధిస్తోంది. వాళ్ళకి కూడా మంచి గుర్తింపు వస్తుందని చెబుతున్నారు…