Nara Lokesh America Visit: అమెరికా పర్యటనలో ఉన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్( AP Minister Nara Lokesh). ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆయన అమెరికా వెళ్లారు. అక్కడి తెలుగువారు ఆత్మీయంగా స్వాగతం పలికారు. భారీ స్థాయిలో కుటుంబాలతో చేరుకున్న వారు సైతం యువనేత పట్ల ఎంతో అభిమానం చెప్పారు. తెలుగుదేశం పార్టీ సారధిగా, భవిష్యత్ ముఖ్యమంత్రిగా ఆవిష్కృతం అయ్యారు నారా లోకేష్. అది అమెరికాలో కూడా స్పష్టమైంది. అయితే అమెరికా పోలీసులు నారా లోకేష్ కు షాక్ ఇచ్చారు. అదే విషయాన్ని ఓ సభలో ప్రస్తావించారు నారా లోకేష్. అమెరికా పోలీసుల నుంచి ఎదురైన పరిణామం గురించి వివరించారు..
* పదేళ్లపాటు అక్కడే..
నారా లోకేష్ అమెరికాలోనే( America) చదువుకున్నారు. ఆయన ఉన్నత విద్య అమెరికాలోనే కొనసాగింది. దాదాపు ఏడేళ్ల పాటు చదువు అమెరికాలోనే కొనసాగింది. రెండేళ్లపాటు అక్కడ ఉద్యోగం కూడా చేశారు లోకేష్. దాదాపు పది సంవత్సరాల వరకు అమెరికాలోనే గడిపారు. అయితే ఒక ముఖ్యమంత్రి మనవడిగా, మరో ముఖ్యమంత్రి కుమారుడిగా అప్పట్లో లోకేష్ ఉండేవారు. కానీ అందులో ఏం ప్రత్యేకతలు కనిపించేవి కావు. అసలు లోకేష్ ఎవరో కూడా చాలామందికి తెలియదు అప్పట్లో. ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారు అప్పుడే ఆయనకు ప్రాచుర్యం దక్కింది.
* ఎయిర్పోర్టులో జనం..
గత పదేళ్లలో లోకేష్ లో ఎంతో పరిణితి పెరిగింది. రాజకీయంగా కూడా పరిణితి సాధిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం( Telugu Desam ) పార్టీకి భావి నాయకుడిగా, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా ప్రమోట్ అయ్యారు లోకేష్. పైగా ఏపీ అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో దేశ విదేశాల్లో ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో దేశ విదేశాల్లో ఉన్న వారు సైతం లోకేష్ కు అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఆయన అమెరికా వెళ్లారు. అయితే దాదాపు వేలాదిమంది ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టుకు వచ్చారు. అయితే ఇటీవల అమెరికాలో జరుగుతున్న పరిణామాలు గురించి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా పోలీసులు ఎయిర్పోర్ట్లో లోకేష్ ను కలిశారు. మిమ్మల్ని స్వాగతం పలికేందుకు వేలాదిమంది తరలి వచ్చారని.. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా మీరు వేరే మార్గంలో వెళ్లాలని వారు కోరారని చెప్పుకొచ్చారు లోకేష్. తాను ఆంధ్రాలో ఉన్నానా.. అమెరికాలో ఉన్నానా అనే అనుమానం కలుగుతోందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికైతే అమెరికాలో లోకేష్ కు పోలీసులు షాక్ ఇచ్చారు.